కొలంబో : శ్రీలంక టెస్టు జట్టుకు కొత్త సారథి వచ్చాడు. రెండేండ్ల క్రితం నాయకత్వ పగ్గాలు అందుకున్న ధనంజయ డిసిల్వా ఆ బాధ్యతలను వైట్‌బాల్ కెప్టెన్ కుశాల్ మెండిస్‌కు అందజేశాడు.
ఇప్పటికే పరిమిత ఓవర్లలో లంకను నడిపిస్తున్న మెండిస్.. త్వరలో పాకిస్థాన్‌తో జరుగబోయే టెస్టు సిరీస్‌తో లంకకు ఆల్‌ఫార్మాట్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇప్పటిదాకా 75 టెస్టులాడిన మెండిస్.. 4,836 రన్స్ చేశాడు.