భువనగిరి అర్బన్, ఫిబ్రవరి 10 : భువనగిరి మున్సిపాలిటీలోని 17వ వార్డును అభివృద్ధిలో ఆదర్శంగా నిలిపేందుకు దంపతులు చెన్న స్వాతీమహేశ్ అలుపెరుగకుండా కృషి చేస్తున్నారు. ప్రభుత్వ అమలు, అర్హులకు సంక్షేమ అందించడంలో కౌన్సిలర్ చెన్న స్వాతి, టీఆర్ఎస్ నాయకుడు చెన్న మహేశ్ ముందంజలో ఉంటున్నారు. పట్టణ ప్రగతిలో పరిశుభ్రంగా మార్చడంతో స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఉత్తమ వార్డుగా ఎంపికై త్వరలో అవార్డు అందుకోనున్నారు.
రూ.50లక్షలతో సేవా కార్యక్రమాలు
కౌన్సిలర్ చెన్న స్వాతి, ఆమె భర్త టీఆర్ఎస్ జిల్లా నాయకుడు చెన్న మహేశ్ వార్డు అభివృద్ధితోపాటు పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ శెభాష్ అనిపించుకుంటున్నారు. వారు చేపట్టిన సేవా కార్యక్రమాలను విజయవంతం చేయడానికి టీఆర్ఎస్ పార్టీ వార్డు అధ్యక్షుడు గాదె శ్రీనివాస్ చేదోడువాదోడుగా ఉంటూ సహకరిస్తున్నారు. చెన్న స్వాతీమహేశ్ నిధులు రూ.50లక్షలకు పైగా సేవా కార్యక్రమాలు చేపట్టారు. శ్రీరామ్‌నగర్‌లో నల్లపోచమ్మ దేవాలయ నిర్మాణం రూ.13లక్షలతో, ఎర్రపోచమ్మ ఆలయం ప్రహరీ, రెండు గదులు రూ.2లక్షలతో, కన్యకాపరమేశ్వరి దేవాలయ నిర్మాణానికి లక్షా 16వేలు అందజేశారు. 30 మంది మృతుల కుటుంబాలకు రూ.5వేల చొప్పున ఆర్థిక సాయం చేశారు.
ముగ్గురు పేద విద్యార్థుల చదువు కోసం రూ.2లక్షలు ఖర్చు చేశారు. వార్డులో ప్రతి ఆడబిడ్డ పెండ్లికి వంట సరుకులు అందిస్తున్నారు. శ్రీరామ్‌నగర్‌కు చెందిన ఒకరి ఆపరేషన్ కోసం రూ.50వేలు, లాక్డౌన్లో కార్మికులకు, యాచకులకు 45 రోజులపాటు మూడు పూటలా భోజనానికి రూ.30లక్షలు, కలెక్టరేట్లోని నాల్గో తరగతి ఉద్యోగులకు రూ.2లక్షల విలువైన నిత్యావసర సరుకులు అందించారు. ఇటీవల కరోనాతో మృతిచెందిన జర్నలిస్టు కుటుంబానికి రూ.50వేలు, 150 మంది మున్సిపల్ కార్మికులకు 25 కిలోల చొప్పున బియ్యం, సరుకులు అందజేశారు. ఎవరెస్టు శిఖరం వెళ్లిన యువతికి రూ.50వేలు అందజేశారు. ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి సహకారంతో వాటర్‌ప్లాంట్, మున్సిపాలిటీ నుంచి వార్డుకు అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం కోసం రూ.10లక్షలు వెచ్చిస్తే సొంత నిధులు మరో రూ.5లక్షలతో పనులు చేయించారు. రూ.3లక్షలతో పది సీసీ కెమెరాలు చేయించారు.
వార్డు అభివృద్ధికి కృషి
ఎమ్మెల్యే సహకారంతో వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నాం. వార్డు ప్రజలకు తమకు తోచిన సహాయం చేస్తున్నాం. తన దృష్టికి వచ్చిన వార్డు, ప్రజల సమ్యలను తీర్చడానికి ఏనాడూ వెనుకంజ వేయలేదు. ఇకముందు కూడా వార్డు ప్రజల సమస్యలను తీర్చడానికి, సేవా కార్యక్రమాలు చేయడానికి ముందు వరుసలో ఉంటాం.
– చెన్న స్వాతీమహేశ్, కౌన్సిలర్
వారుప్రజా సేవకులు..
కౌన్సిలర్ చెన్న స్వాతి, టీఆర్ఎస్ నాయకుడు మహేశ్ ప్రజా సేవకులు. వార్డు కౌన్సిలర్‌గా ఉండడం మా అదృష్టం. వార్డు అభివృద్ధికే కాదు.. ప్రజల వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కరిస్తూ.. సేవా కార్యక్రమాల్లో ముందుంటున్నారు.
– గాదె శ్రీనివాస్, టీఆర్ఎస్ వార్డు అధ్యక్షుడు