యాదాద్రి: ఓ ద్వి చక్ర వాహనానికి 73 ఫెండింగ్ చలాన్లు ఉన్నట్లు యాదగిరిగుట్ట ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. మంగళ వారం పట్టణంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా భువనగిరి మండలంలోని బస్వాపూర్ గ్రామానికి చెందిన నారాయ ణ అనే వ్యక్తి ద్విచక్ర వాహనానికి కొంతకాలంగా వివిధ ప్రాంతాల్లో మోటరు వాహన చట్టం క్రింద నమోదైన రూ.15,745 విలువగల 75 ఫెండింగ్ ఛలాన్లు గుర్తించి వాహనాన్నిసీజ్ చేసినట్లు యాదగిరిగుట్ట ట్రాఫిక్ సీఐ సైదయ్య తెలిపారు.
పెండింగ్ చలాన్ చెల్లించిన అనంతరం వాహనాన్ని విడుదల చేస్తామన్నారు. యాదగిరిగుట్టతో పాటు తుర్కపల్లి, రాజా పేట, ఆలేరు, మోటకొండూర్, భువనగిరి పట్టణ వాసులు తమ వాహనాలను నడిపే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.
యాదగిరిగుట్ట పట్టణంలో ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలకు నంబర్ ఫ్లేట్స్ లేకుండా, నంబర్ తుడిచి, వాహనానికి ముందు ఒక నంబర్, వెనుక ఒక నంబర్ బిగిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, వెంటనే నంబర్ సరిచేసుకోవాలని సూచించారు. నంబర్ ప్లేట్ లేని వాహనాలపై ప్రత్యేక నిఘా ఉం టుందని వివరించారు. సరైన నంబర్ లేని వాహనాలను సీజ్ చేస్తామని తెలిపారు.