భువనగిరి అర్బన్, అక్టోబర్ 29 : ఆడబిడ్డల వివాహానికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా ఆర్థిక సాయం అందిస్తూ సీఎం కేసీఆర్ పెద్దన్నగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులతో పాటు ఎమ్మెల్యే తన సొంత నిధులతో నూతన వధూవరులకు వస్ర్తాలను అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ వెళ్తున్నాయని అన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడల అమరేందర్‌గౌడ్, మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, జడ్పీటీసీ బీరు మల్లయ్య, పీఏసీఎస్ చైర్మన్ నోముల పరమేశ్వర్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు కంచి మల్లయ్య, టీఆర్ఎస్ పార్టీ పట్టణ, మండలాధ్యక్షులు కిరణ్‌కుమార్, జనగాం పాండు, కౌన్సిలర్లు వడిచర్ల లక్ష్మీకృష్ణ యాదవ్, పంగరెక్క స్వామి, అరుణా పూర్ణచందర్ పాల్గొన్నారు.