యాదాద్రి, అక్టోబర్ 28 : టీఆర్ఎస్ ద్విదశాబ్ది ఉత్సవాల్లో భాగంగా వచ్చే నెల 15న వరంగల్‌లో నిర్వహించే విజయ గర్జన సభకు ఆలేరు నియోజకర్గం నుంచి కార్యకర్తలు సైనికుల్లా కదిలి రావాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో టీఆర్ఎస్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. సభకు వచ్చేందుకు సామాన్య జనం కూడా ఆసక్తి చూపుతున్నారని, సభకు భారీగా జనం వచ్చి ఆలేరు గడ్డ అంటే టీఆర్ఎస్ అడ్డా అని చాటి చెప్పాలన్నారు. ఇందుకు మండలాల వారీగా పార్టీ శ్రేణులు సమావేశాలను ఏర్పాటు చేసుకొని సమాయత్తం కావాలని సూచించారు. సభ విజయవంతానికి కమిటీలు కీలకంగా వ్యవహరించాలని, ప్రతి గ్రామం నుంచి జనం వచ్చేలా చూడాలని కోరారు.
50 వేల మందిని తరలిస్తాం : ఎన్డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి
మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు విజయగర్జన సభకు ఆలేరు నియోజకవర్గం నుంచి 50 వేల మందిని తరలిస్తామని, ఇందుకోసం పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని ఎన్డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. 20 ఏండ్లలో రాష్ర్టాన్ని సాధించడమే కాకుండా అనేక సంక్షేమ పథకాలను అందిస్తూ ప్రజల మన్ననలు అందుకున్న పార్టీగా టీఆర్ఎస్ ఎదిగిందన్నారు. యాదాద్రి జిల్లాను ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతంగా సీఎం కేసీఆర్ తీర్చిదిద్దారని, రాబోయే మూడేండ్లలో ఇక్కడి యువతకు పుష్కలంగా ఉపాధి అవకాశాలు రాబోతున్నాయని తెలిపారు. పార్టీలో ఉంటూ గ్రూప్ రాజకీయాలు చేస్తే సహించేది లేదని, ఎంతటివారైనా పార్టీకి కట్టుబడి పని చేయాలన్నారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్‌గౌడ్, జడ్పీ వైస్ చైర్మన్ బీకూనాయక్, జడ్పీటీసీలు తోటకూరి అనూరాధ, పల్లా వెంకట్‌రెడ్డి, కోలుకొండ లక్ష్మి, చామకూర గోపాల్‌గౌడ్, ఎంపీపీలు పైళ్ల ఇందిర, చీముల సుధీర్‌రెడ్డి, తాండ్ర అమరావతి, గోపగాని బాలమణీయాదగిరిగౌడ్, భూక్యా సుశీల, టీఆర్ఎస్ మండలాధ్యక్షులు కర్రె వెంకటయ్య, నాగిర్తి రాజిరెడ్డి, నరేందర్‌రెడ్డి, వెంకటేశ్‌గౌడ్, ఎండీ ఖలీల్, బీసు చందర్‌గౌడ్, బొట్ల యాదయ్య, గంగుల శ్రీనివాస్, మున్సిపల్ చైర్ పర్సన్ ఎరుక సుధామహేందర్‌గౌడ్, ఆలేరు మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకర్, పీఏఎసీఎస్ చైర్మన్లు ఇమ్మడి రామిరెడ్డి, మల్లేశ్‌గౌడ్, గూదె బాలనర్సయ్య, మదర్ డెయిరీ డైరెక్టర్లు కళ్లెపల్లి శ్రీశైలం, కందాల అలివేలు రంగారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు వంటేరు సురేశ్‌రెడ్డి, మిట్ట వెంకటయ్య, కసావు శ్రీనివాస్‌గౌడ్, రేపాక స్వామి, పెలిమెల్లి శ్రీధర్‌గౌడ్, ఎగ్గిడి కృష్ణ, భూమండ్ల
అయిలయ్య పాల్గొన్నారు.
వర్టూర్కు మొదటి విడుత ‘దళిత బంధు’
2007లో పల్లెనిద్రలో భాగంగా ఉద్యమ నేత కేసీఆర్ వర్డూర్లోని దళితవాడలో బస చేసి, బోజనం చేశాడని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత తెలిపారు. రెండురోజుల క్రితం సీఎం కేసీఆర్‌ను కలిసి విషయం చెప్పానని, వర్టూర్కు మొదటి విడుత ‘దళిత బంధు’ను అమలు చేస్తానని, వివరాలు సేకరించి ఇవ్వాలని తనకు చెప్పినట్లు ఆమె వివరించారు. త్వరలోనే వర్టూర్లోని దళితులందరికీ దళితబంధు అమలు కాబోతుందని స్పష్టం చేశారు.