శ్రీవారి ఖజానాకు రూ.6,16,057 ఆదాయం
యాదాద్రి, అక్టోబర్ 27 : పవ్రిత పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి బాలాలయంలో బుధవారం ఉదయం స్వామి, అమ్మవార్లకు విశేష పూజలను ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహించారు. వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి, అమ్మవార్లకు సుప్రభాతం చేపట్టారు. ప్రతిష్ఠామూర్తులకు ఆరాధన నిర్వహించారు. ఉత్సవమూర్తులను పంచామృతాలతో అభిషేకించి, అనంతరం తులసీపత్రాలతో అర్చన జరిపారు. దర్శనమూర్తులకు సువర్ణపుష్పార్చన, అమ్మవారికి కుంకుమార్చన చేశారు. బాలాలయంలోని మహామండపంలో సుదర్శన నారసింహ హోమం, విశ్వక్సేనారాధన, నిత్యతిరుకల్యాణ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. రాత్రి ఆరగింపు చేపట్టిన అర్చకులు అనంతరం స్వామివారికి పవళింపు సేవ నిర్వహించారు. శ్రీవారి ఖజానాకు బుధవారం రూ.6,16,057 ఆదాయం వచ్చినట్లు ఈఓ గీత తెలిపారు.
శ్రీవారి ఖజానా ఆదాయం (రూపాయల్లో)
ప్రధాన బుకింగ్ ద్వారా 67,574
రూ.100 దర్శనం టిక్కెట్ 24,000
వేద ఆశీర్వచనం 2,580
క్యారీబ్యాగుల విక్రయం 2,750
టెంకాయల విక్రయం 30,000
వ్రత పూజలు 24,000
కల్యాణకట్ట టిక్కెట్లు 13,000
ప్రసాద విక్రయం 2,68,865
వాహన పూజలు 9,400
టోల్గేట్ 860
అన్నదాన విరాళం 8,828
సువర్ణ పుష్పార్చన 1,00,960
యాదరుషి నిలయం 43,850
పాతగుట్ట నుంచి 11,740
గోపూజ 150