భువనగిరి కలెక్టరేట్, నవంబర్ 7 : వేపచెట్లకు కొమ్మ తెగులు వస్తున్నందున కార్బండిజమ్ ద్రావణాన్ని పిచికారీ చేయిస్తున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనూరాధ తెలిపారు. ఆదివారం అగ్నిమాపక శాఖ సిబ్బంది సహకారంతో కలెక్టరేట్లోని వేప చెట్లకు సోకిన కొమ్మ ఎండు తెగులు నివారణకు కార్బండిజమ్ ద్రావణాన్ని పిచికారీ చేయించి మాట్లాడారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో సంబంధిత శాఖల సమన్వయంతో పిచికారీ చేయిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో భువనగిరి, యాదగిరిగుట్ట అగ్నిమాపక శాఖ అధికారులు యాదయ్య, రమేశ్ పాల్గొన్నారు.