భువనగిరి అర్బన్/భూదాన్‌పోచంపల్లి /బీబీనగర్/వలిగొండ, నవంబర్ 7 : రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, వానకాలంలో రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. భువనగిరి మండలంలోని తుక్కాపురం, భూదాన్‌పోచంపల్లి మండల కేంద్రంతో పాటు జూలూరు, బీబీనగర్ మండలం గూడూరు, అన్నంపట్ల, వలిగొండ వ్యవసాయ మార్కెట్ యార్డ్, ఎదుళ్లగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆదివారం ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. రైతులకు ఇప్పటికే నిరంతర ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా అమలు చేయడంతో పాటు ధాన్యం ఆరబెట్టుకోవడానికి కల్లాలను ఏర్పాటు చేసిందన్నారు. రైతులు పంటల సాగుపై అవగాహన పెంచుకొని యాసంగిలో వరికి బదులుగా చిరుధాన్యాలు సాగు చేయాలన్నారు. పీఏసీఎస్ చైర్మన్ నోముల పరమేశ్వర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ జడల అమరేందర్‌గౌడ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు కొలుపుల అమరేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ నల్లమాస రమేశ్‌గౌడ్, మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, జడ్పీటీసీ బీరు మల్లయ్య, మున్సిపల్ వైస్‌చైర్మన్ చింతల కిష్టయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జనగాం పాండు, ప్రధానకార్యదర్శి నీల ఓంప్రకాశ్‌గౌడ్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ కంచి మల్లయ్య, పీఏసీఎస్ వైస్ చైర్మన్ మహేందర్‌నాయక్, సర్పంచ్ నోముల పద్మామహేందర్రెడ్డి, ఎంపీటీసీ రాసాల మల్లేశం, మాజీ ఎంపీపీ అతికం లక్ష్మీనారాయణగౌడ్ పాల్గొన్నారు. అనంతరం భువనగిరి పట్టణంలో కొత్తగా నిర్మించిన రైతుబజార్‌ను ఎమ్మెల్యే సందర్శించారు.
భూదాన్‌పోచంపల్లి ఎంపీపీ మాడ్గుల ప్రభాకర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ పాక వెంకటేశం యాదవ్, మున్సిపల్ చైర్పర్సన్ చిట్టిపోలు విజయలక్ష్మీశ్రీనివాస్, వైస్ చైర్మన్ బాత్క లింగస్వామి, పీఏసీఎస్ చైర్మన్లు కందాడి భూపాల్‌రెడ్డి, అందెల లింగం యాదవ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు నోముల మాధవరెడ్డి, ఐతరాజు భిక్షపతి, పగిళ్ల సుధాకర్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు కోట మల్లారెడ్డి, రావుల శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
బీబీనగర్‌లో మార్కెట్ వైస్ చైర్మన్ అల్వా మోహన్‌రెడ్డి, ఎంపీపీ సుధాకర్ గౌడ్, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ స్థాయీ సంఘం చైర్మన్ గోలి ప్రణీతాపింగల్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ బొక్క జైపాల్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచులు గడ్డం బాల్‌రెడ్డి, వసుమతి, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
వలిగొండలో ఎంపీపీ నూతి రమేశ్, జడ్పీటీసీ వాకిటి పద్మాఅనంతరెడ్డి, మార్కెట్ చైర్పర్సన్ కునపురి కవిత, పీఏసీఎస్ చైర్మన్ సుర్కంటి వెంకట్‌రెడ్డి, శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం చైర్మన్ ముద్దసాని కిరణ్‌రెడ్డి, సర్పంచులు బోళ్ల లలిత, బోడపట్ల భారతమ్మ, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఎల్లంకి స్వామి, మార్కెట్ కార్యదర్శి ఎండీ వహీద్ పాల్గొన్నారు.