న్యూఢిల్లీ: జాతీయ స్థాయి రెజ్లర్, ఆయుధాల డీలర్(Arms Dealer) సోనూ లంగడాను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అనేక నేరాల్లో అతను తీవ్ర స్థాయి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. సోనూ లంగడాను పెహల్వాన్ అని పిలుస్తారు. ఓ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన తర్వాత అతను నేరగాళ్లకు అక్రమంగా ఆయుధాలు అందించాడు. గడిచిన ఎనిమిదేళ్ల నుంచి అతను పరారీలో ఉన్నాడు. అతన్ని మే 29వ తేదీన పట్టుకున్నారు. యూపీలోని భాగ్పాత్లో అతన్ని అరెస్టు చేశారు.
ఆయుధాలు సరఫరా కేసులో 2017, జూన్ 29వ తేదీన అతన్ని దోషిగా ప్రకటించారు. సుదీర్ఘమైన నేర చరిత్ర ఉన్నది. కనీసం ఆరు సీరియస్ క్రైం కేసుల్లో అతని పాత్ర ఉన్నది. మర్డర్, రేప్, కిడ్నాప్, డెకాయిటీ, ఎస్సీ,ఎస్టీ యాక్ట్, ఆర్మ్స్ యాక్ట్ కింద అతనిపై కేసులు బుక్ చేశారు. 2016లో జరిగిన కేబుల్ ఆపరేటర్ మర్డర్ కేసు అంశంలో విచారణ నిర్వహిస్తున్న సమయంలో ఆయుధాలు సరఫరా చేసింది సోనూ లంగడా అని తేలింది. అయితే అప్పటి నుంచి అతని కోసం గాలిస్తున్నారు. 8 ఏళ్ల పాటు పోలీసులు అతని కోసం వెతికారు.
2013లో జరిగిన ప్రమాదంలో తన కాలు పోయినట్లు సోనూ తెలిపాడు. అంతకముందు అతను జాతీయ స్థాయి రెజ్లర్‌గా పోటీపడినట్లు చెప్పాడు. కాలు తీసి వేసిన తర్వాత కుటుంబ పోషణ కోసం స్థానిక గ్యాంగ్‌లతో జతకట్టాడు. ఆయుధాల వ్యాపారంలో కీలక పాత్ర పోషించాడు. అనేక మంది నేరగాళ్లకు మద్యాన్ని కూడా సరఫరా చేశాడు.
Read More..