మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
బన్సీలాల్‌పేట్, ఏప్రిల్ 8 : రాష్ట్రంలో అనేక ఆలయాలను అభివృద్ధి చేశామని, నూతన పాలక మండలి సభ్యులు ఆలయాల్లో ఆధ్యాత్మికత వాతావరణం నెలకొల్పడానికి కృషి చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. పద్మారావునగర్ టీఆర్ఎస్ ఇన్చార్జి పవన్‌కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పోల్బాల్ హనుమాన్ ఆలయం, శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయాల్లో నూతనంగా ఏర్పాటైన పాలక మండలి సభ్యులు శుక్రవారం మర్యాదపూర్వకంగా మంత్రి తలసానిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
పద్మారావునగర్‌లోని పోల్బాల్ హనుమాన్ ఆలయంలో నూతన పాలక మండలి ధర్మకర్తలు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. చైర్మన్‌గా రాజేశ్ గౌడ్, సభ్యులుగా సుధాకర్ రెడ్డి, అనితా రెడ్డి, సునీతా రెడ్డి, అమృత, దుర్గ, కుశాల్, ముషీరాబాద్ చౌరస్తాలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం నూతన పాలక మండలి చైర్మన్‌గా శ్రీనివాస్ గౌడ్, ధర్మకర్తలుగా రాజేంద్రప్రసాద్, వెంకట్, యశోద, హామ్‌రాజ్, ముక్క శ్రీను, గోవింద్ రాజ్ ప్రమాణ స్వీకారం చేశారు. బన్సీలాల్‌పేట్ కార్పొరేటర్ హేమలత, దేవాదాయ శాఖ సహా య కమిషనర్ కృష్ణ, ఈవో రాజేశ్, పద్మారావునగర్ టీఆర్ఎస్ ఇన్చార్జి పవన్‌కుమార్ గౌడ్, ఏసూరి మహేశ్, వెంకటేశన్ రాజు, శ్రీకా ంత్‌రెడ్డి పాల్గొన్నారు.