Bribe | మల్కాజిగిరి, ఏప్రిల్ 21 : మల్కాజి గిరి సర్కిల్ కార్యాలయంలో ఇవాళ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చెయ్యి తడిపితే కానీ పని చెయ్యరా అంటూ మహిళలు డీసీ రాజును నిలదీశారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ.. చెట్ల కొట్టివేత, శానిటైజేషన్, టౌన్ ప్లానింగ్‌లో, స్ట్రీట్ లైట్స్ డిపార్ట్మెంట్లో ఏ పని కూడా చెయ్యి తడపకుండా జరగట్లేదని ప్రజలు డీసీ రాజు వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.
విమలాదేవినగర్కు చెందిన సత్య, విష్ణుపురికి చెందిన శారద తమ దగ్గర నుంచి హార్దికల్చర్ సూపర్వైజర్ వెంకటేష్ డబ్బులు తీసుకున్నాడని, పని చెయ్యమంటే అసభ్యంగా మాట్లాడుతున్నాడని ఫిర్యాదు చేశారు. అధికారులు చేయాల్సిన పనికి మేము లంచం ఎందుకు ఇవ్వాలని నిలదీశారు. దోమల సమస్య ఘోరంగా ఉందని, ఫిర్యాదులు చేసినా పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
శివపురి కాలనీలో హార్దికల్చర్ ఆఫీసర్‌పై కాలనీ వాసుల ఫిర్యాదు మేరకు హార్దికల్చర్ సూపెర్వైజర్ మహేశ్వరి ఎంక్వయిరీకి రాగా, కాలనీ వాసులు ఆమెను నిలదీశామని అన్నారు. చాలాసార్లు ప్రజావాణిలో ఫిర్యాదు ఇచ్చినా, డబ్బులు సమర్పించుకున్నా వెంకటేష్ ఆగడాలు ఆగట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సూపర్వైజర్ వెంకటేష్ తమతో నోటికొచ్చినట్లు అసభ్యంగా మాట్లాడుతున్నాడని, మహిళల పట్ల ఈ విధంగా మాట్లాడటం సరి కాదని అన్నారు.
ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి డివిజన్ బీజేపీ కార్పొరేటర్ శ్రావణ్, బక్క నాగరాజ్, సీతారాం కృష్ణ, నందు, సుబ్బారావు, సూరజ్ సింగ్, విజయ్ కుమార్, వెంకటేష్, సత్య, శారదా, సులోచన, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
Prayag ManZhi | తనపై కోటి రూపాయల రివార్డ్ ఉన్న మావోయిస్టు మాంఝీ ఎన్కౌంటర్లో మృతి
Road Accident | నెలాఖరులో పదవీ విరమణ..అంతలోనే రోడ్డుప్రమాదం.. ఘటనలో హెడ్మాస్టర్ దుర్మరణం