న్యూఢిల్లీ: భారత బ్యాటర్ వీఆర్ వనిత క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికింది. సోమవారం ట్విటర్ వేదికగా తన రిటైర్మెంట్ను ప్రకటించింది. 2014లో భారత మహిళా జట్టులోకి అరంగేట్రం చేసిన వనిత.. టీమ్ఇండియా తరఫున ఆరు వన్డేలు, 16 టీ20లు ఆడి తనదైన పాత్ర పోషించింది. తన ప్రయాణంలో సహకరించిన వారందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపింది. దేశీయ క్రికెట్లో తనకు అవకాశం ఇచ్చిన కర్ణాటక, బెంగాల్ క్రికెట్ సంఘాలకు ధన్యవాదాలు చెప్పింది. ‘19 ఏండ్ల కిందట ఎంతో ప్రేమతో క్రికెట్ ఆడడం మొదలుపెట్టానో.. ఇప్పుడు కూడా ఆటపై అంతే ప్రేమ ఉంది. నా మనసు ఇంకా ఆడాలని చెబుతున్నా.. శరీరం మాత్రం సహకరించడం లేదు. అందుకే క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలుకుతున్నా’ అని 31 ఏండ్ల వనిత తెలిపింది.