ఒకే కాన్పులో 9 మంది జననం.. మాలిలో ఘటన
ఒక కాన్పులో ఇద్దరు, ముగ్గురు జన్మించడం మనం చూస్తుంటాం. అయితే, మాలికి చెందిన ఓ మహిళ 9 మందికి జన్మనిచ్చి కొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నది. పశ్చిమ ఆఫ్రికా దేశమైన మాలిలో 25 ఏండ్ల మహిళ హలీమా సిస్సే తొమ్మిది మంది పిల్లలకు జన్మనిచ్చింది

బామ్కో: ఒక కాన్పులో ఇద్దరు, ముగ్గురు జన్మించడం మనం చూస్తుంటాం. అయితే, మాలికి చెందిన ఓ మహిళ 9 మందికి జన్మనిచ్చి కొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నది. పశ్చిమ ఆఫ్రికా దేశమైన మాలిలో 25 ఏండ్ల మహిళ హలీమా సిస్సే తొమ్మిది మంది పిల్లలకు జన్మనిచ్చింది. ఈ మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి వార్తల్లో ఉన్నారు. సిస్సే కాన్పు సజావుగా సాగేందుకు మాలి ప్రభుత్వం పలు చర్యలు తీసుకున్నది. మొరాకోలో ఆమెకు సిజేరియన్ ఆపరేషన్ చేసి శిశువులను బయటకు తీశారు. ఈ తొమ్మిది మంది పిల్లల్లో ఐదుగురు బాలికలు, నలుగురు బాలురు ఉన్నారు. అందరూ ఆరోగ్యంగా ఉన్నట్లు దవాఖాన యాజమాన్యం ప్రకటించింది.
మార్చి నెలలో హలీమా సిస్సేకు అల్ట్రాసౌండ్ చేయగా గర్భం అసాధారణంగా ఉన్నట్లు తేలిందని మాలి ఆరోగ్య మంత్రి ఫాంటా సిబి తెలిపారు. ఆ సమయంలో ఏడుగురు పిల్లలున్నారని నివేదిక వచ్చింది. సంక్లిష్ట పరిస్థితుల కారణంగా ఆమెను మొరాకోకు తరలించి కాన్పు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొరాకోలో మరోసారి అల్ట్రాసౌండ్ పరీక్షలు చేయగా ఏడుగురు పిల్లలు కనిపించారు. డెలివరీ సమయం దగ్గరపడినా నొప్పులు రాకపోవడంతో వైద్యులు సిజేరియన్ ఆపరేషన్ చేశారు. సిస్సే గర్భం నుంచి తొమ్మిది మంది పిల్లలను బయటకు తీసి ఊపిరిపీల్చుకున్నారు. దీనిని చాలా అరుదైన సంఘటనగా భావిస్తున్నట్లు మాలి ఆరోగ్య మంత్రి సిబి చెప్పారు. హలిమాతోపాటు పిల్లలంతా ఆరోగ్యంగా ఉన్నారని తేలిన తర్వాత వారిని మాలికి తీసుకువస్తామని ఆయన తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ఎలోన్ మస్క్ ఇంటర్నెట్కు బఫర్ ఒపెనింగ్స్
చైనాలో ఉయ్గార్ ముస్లింలపై దారుణాలకు వ్యతిరేకంగా న్యూజిలాండ్ పార్లమెంటు ప్రతిపాదన
బుద్గాంలో డీఆర్డీఓ 500 పడకల దవాఖాన
టీకా వృథా తగ్గేలా చేస్తున్న కేరళకు ప్రధాని ప్రశంసలు
భారత్‌లో అమెరికా కొత్త రాయబారిగా లాస్ ఏంజిల్స్ మేయర్..?
హర్యానాలో ప్రభుత్వ ఆజమాయిషీలో ప్రైవేట్ దవాఖానలు
ఓటమితో మమతకు సీఎంగా నైతిక హక్కు లేదు : త్రిపుర సీఎం బిప్లబ్
యాహూతో గూగుల్‌ను సవాల్ చేయాలని మైక్రోసాఫ్ట్ ప్లాన్..?!
ఫుట్‌పాత్‌పై రసరమ్య సంగీత బాణీలు.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | ఫ్రాన్స్ అగ్నిగుండం.. భవనాలకు నిప్పు, దుకాణాలు లూటీ.. హింసాత్మకంగా మారిన నిరసనలు
Russia-Ukraine War | రష్యాపై వెయ్యి డ్రోన్లతో ఉక్రెయిన్ దాడి.. భారీగా మంటలు
Prakash Raj | 23న దేశవ్యాప్తంగా ప్రజామార్చ్.. ‘పీపుల్ అగైనెస్ట్ సర్’ కూటమి పిలుపు
SIR | ప్రపంచమంతా ‘జంతర్ మంతర్’! సర్‌కు వ్యతిరేకంగా అనేక దేశాల్లో ప్రవాస భారతీయుల నిరసనలు
India vs Zimbabwe T20I | అమ్మాయిలు అదుర్స్.. దంచికొట్టిన షెఫాలీ, మంధాన.. రెండో టీ20లో భారత్ ఘన విజయం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

