మంథని : తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు( Minister Sridhar Babu) రూ. 300 కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ((Putta Madhukar) ) విమర్శించారు. మంథనిలోని గోదావరి తీరంలో నూతనంగా నిర్మించనున్న వంతెన( Bridge) స్థలం వద్ద మంగళవారం ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా పుట్ట మధూకర్ మాట్లాడుతూ.. రూ. 300 కోట్లతో మంచిర్యాల జిల్లా శివ్వారం నుంచి మంథని గోదావరి నదిపై వంతెన నిర్మాణ పనులు చేపట్టనున్నారన్నారు. ఇందులో రూ. 125 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం, రూ. 164 కోట్ల అప్రోచ్ రోడ్డు నిర్మాణంతో పాటు మరికొన్ని నిధులు భూనిర్వాసితుల కోసం కేటాయించారు. అయితే ఇంత ప్రజాధనాన్ని వెచ్చించి నిర్మిస్తున్న ఈ వంతెన నిర్మాణంతో మంథని, మంచిర్యాల జిల్లాలోని ప్రజకు ఎలాంటి ఉపయోగకరంగా లేకుండా పోతుందని విమర్శించారు. ఈ వంతెన రహదారికి ఎక్కడ కూడా హైవేకు కనెక్టు కావడం లేదని ఆరోపించారు.
ఈ రహదారి శిశ్వారం గ్రామానికి మాత్రమే చేరుకుంటుందని , అక్కడి నుంచి చెన్నూరుకు వెళ్లాలంటే సుమారు 20కిలో మీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది పేర్కొన్నారు. చెన్నూరు( Chennur), మంథనికి ( Manthani) ఎప్పుడు కూడా వ్యాపార సంబంధిత రాక పోకలు లేవని, అలాంటప్పుడు ప్రజలకు ఈ వంతెన వల్ల కలిగే లాభం ఏముంటుందని ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సిరిపురం బ్యారేజీ వద్ద వంతెన నిర్మించామని ప్రస్తుతం ఆ వంతెన మీద నుంచి రాక పోకలు కొనసాగుతున్నాయన్నారు.
సిరిపురం వంతెన నుంచి వెళ్లినా, తాజాగా నిర్మించబోయే వంతెన మీద నుంచి వెళ్లిన ఒకే దగ్గరికి చేరుతారన్నారు. కేవలం 10 కిలో మీటర్లు మాత్రమే తగ్గుతుందని, 10 కిలో మీటర్ల దూరాన్ని తగ్గించేందుకు రూ. 300 కోట్ల ప్రజాధనాన్ని వినియోగిస్తారా అని ప్రశ్నించారు. గోదావరి వద్ద నిర్మించే వంతెనతో నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని కేవలం ఆయన బంధువులైన సీఎల్.రాజంతో పాటు మరికొంత మంది భూములకు ధరలకు రావాలనే ఉద్ధేశ్యంతో మాత్రమే ఈ వంతెనను నిర్మిస్తున్నారని విమర్శించారు. సీఎల్ రాజంకు మంథని మున్సిపాలిటీ పరిధిలోని కూచీరాజ్పల్లిలో 50 ఎకరాల భూమి ఉందని ఆ భూమికి దగ్గర బ్రిడ్జి రోడ్డును మ్యాప్ చేశారనిచ దీన్ని వల్ల రాజం భూములకు డిమాండ్ వస్తుందని ఆరోపించారు.
వేలాలో మంత్రి బంధువులకు భూములకు కూడా ధరలు వచ్చేందుకు మాత్రమే ఈ వంతెన నిర్మిస్తున్నారన్నారు. మంత్రికి మంథని నియోజకవర్గ ప్రజలపై ఉంటే ఆరెంద మానేరుపై వంతెనను నిర్మించాలన్నారు. గతంలో ఆరెంద మానేరుపై వంతెన నిర్మించాలని తాము ప్రతిపాదనలు చేశామని గుర్తు చేశారు.
అడవిసోమన్‌పల్లి మానేరుపై స్వర్గీయ మాజీ ప్రధాన మంత్రి పీవీ.నరసింహారావు ( PV Narasimha Rao ) నిర్మించిన వంతెన ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుందన్నారు. ఆ వంతెన కూలీ పోతే మంథనికి, కాటారానికి పూర్తిగా రాక పోకలు నిలిచి పోతాయన్నారు. అడవిసోమన్‌పల్లి మానేరుపై నూతన వంతెన నిర్మించడంతో పాటు ఆరెంద మానేరుపై వంతెన నిర్మిస్తే నియోజకవర్గ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మధుకర్ అన్నారు.
కాళేశ్వరం, అన్నారం, దామెరకుంటలతో పాటు పలు గ్రామాలకు రాక పోకలు దగ్గరగా ఉంటుంది. మంథని మున్సిపాలిటీలోని బోయినిపేట, గొల్లగూడెం, కూచీరాజ్పల్లి వాసులకు మేలు జరిగేలా రింగ్ రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేశారు. వంతెన నిర్మాణ పనులు ఇంకా ప్రారంభం కాలేదని, ఇప్పటికైనా శివ్వారం వద్ద నిర్మించే బ్రిడ్జితో ఎలాంటి ప్రయోజనాలు లేవనే విషయాన్ని గ్రహించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఎగోలపు శంకర్‌గౌడ్, తగరం శంకర్ లాల్, ఆరెపల్లి కుమార్, కనవేన శ్రీనివాస్, కాయితీ సమ్మయ్య, ఆకుల రాజబాపు, గొబ్బూరి వంశీ, వెల్పుల గట్టయ్య, ఆసీఫ్, సమ్మయ్య పాల్గొన్నారు.