రాయపోల్, మే 06 : గాలి వాన బీభత్సం సృష్టించడంతో జన జనజీవనం అతల కుతలమైంది. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం రాత్రి గాలి వాన బీభత్సం సృష్టించడంతో చేతికి వచ్చిన వరి పంట నేల వాలింది. విద్యుత్ స్తంభాలు గాలివానకు కుప్పకూలాయి. రాత్రి నుంచి ఇప్పటివరకు విద్యుత్ సరఫరా లేకపోవడంతో గ్రామాలు అంధకారంలో ఉన్నాయి. భారీ గాలివాన రావడంతో కొత్తపల్లి,టేంకంపేట, రాంసాగర్ గ్రామాలకు వెళ్లే రహదారిపై భారీ వృక్షాలు రోడ్డుకు అడ్డంగా పడడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
11కేవి విద్యుత్తు స్తంభాలు గాలివానకు కిందపడిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మండల కేంద్రంలో గాలివానకు రేకుల షెడ్లు ఎగిరి రోడ్డుపై పడ్డాయి. వందల ఎకరాల్లో వరి పంట చేతికి వచ్చిన సమయంలో నేలరాడంతో రైతులకు నష్టం జరిగింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. విద్యుత్ అధికారులు గ్రామాల్లో తిరుగుతూ విద్యుత్ పునరుద్ధరణ కోసం చర్యలు తీసుకుంటున్నారు.
కొత్తపల్లి సర్పంచ్ శ్యామల ఆధ్వర్యంలో జేసీబీ సహాయంతో రోడ్డుపై ఉన్న భారీ వృక్షాలను తొలగించి రాకపోకలను సరి చేశారు. పలు గ్రామాల్లో గాలివాన బీభత్సం సృష్టించడంతో మండల వ్యాప్తంగా పంటలకు నష్టం వాటిల్లింది. విద్యుత్ సరఫరా లేకపోవడంతో మండల ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. అధికారులు ఇప్పటికైనా స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Raya