హనుమకొండ చౌరస్తా, జులై 19: గ్రేటర్ వరంగల్ క్రిస్టియన్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో డాక్టర్ విలియం కేరీ 264వ జయంతిని పురస్కరించుకుని విశాల్, రూత్ మంగల్వాడి రాసిన ఆధునిక భారత పితామడు ‘విలియం కేరీ’ అనే పుస్తకం నుంచి క్విజ్ పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు మార్టిన్ లూథర్, కాకిలేటి అబ్రహం, సుప్రియ సర్వేశ్ ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. క్విజ్ పోటీ మూడు దశల్లో జరుగుతుందని ప్రిలిమినరీ(రాత పరీక్ష), సెమీ ఫైనల్(మౌళిక) ఆగస్టు 9న మధ్యాహ్నం 2 గంటల నుంచి ఫైనల్ క్విజ్ 10వ తేదీన 2 గంటలకు మూడు కేంద్రాల్లో కాజీపేట కేంద్రం ఎక్లేసియా పుల్ గాస్పల్ చర్చి, సిద్ధార్థనగర్, కాజీపేట, హనుమకొండ కేంద్రంలోని సెంటినరీ బాప్టిస్ట్ చర్చి(సీబీసీ), వరంగల్ కేంద్రంలోని సెంటినరీ బాప్టిస్ట్ చర్చిలో జరుగుతుందన్నారు.
18 నుంచి 40 సంవత్సరాలవారు పోటీల్లో పాల్గొనవచ్చని ఈనెల 31న సాయంత్రం 5లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, ఒక బృందంలో 3-5 మంది సభ్యులు పాల్గొనవచ్చని, ఒక సంఘం నుంచి గరిష్ఠంగా మూడు బృందాలు మాత్రమే పాల్గొనాలన్నారు. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.250 ఉంటుందని, రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి టీంకు ఒక పుస్తకం ఉచితంగా ఇవ్వబడుతుందని, అదనంగా పుస్తక ప్రతులు కావాలంటే ఒక పుస్తకానికి రూ.150 చొప్పున చెల్లించి సంబంధిత కేంద్రాల వద్ద పొందవచ్చన్నారు. సెక్రటరీ సుప్రియ సర్వేశ్‌కు 8332862007 నెంబర్‌కు ఫోన్‌పే లేదా గూగుల్‌పే ద్వారా రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి పేమెంట్ స్క్రీన్‌షాట్ వాట్సప్ ద్వారా షేర్ చేయాలని సూచించారు. మొదటి బమతి రూ.25 వేలు, రెండో బమతి రూ.15 వేలు, మూడో బమతి రూ.10 వేలు అందించనున్నట్లు వారు తెలిపారు.