మంచిర్యాల అర్బన్, సెప్టెంబర్ 29 : మంచిర్యాల పట్టణంలోని అశోక్ రోడ్లో దారుణ ఘటన చోటుచేసు కుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో వైద్య మోహన్(40) అనే వ్యక్తిని అతడి భార్య రోకలిబండతో కొట్టి హత్య చేసినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన మోహన్ అక్కడికక్కడే మృతిచెందినట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న మంచిర్యాల పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
ఘటనకు దారితీసిన కారణాలపై దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాలే హత్యకు కారణమా? మరేదైనా కారణం ఉందా? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. కాగా, మృతుడు వైద్య మోహన్ ఓ యూట్యూబ్ ఛానల్లో రిపోర్టర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.