PCOS | పీసీఓఎస్ సమస్య మహిళల్లో అసలు ఎందుకు వస్తుంది.. ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..?
పీసీఓఎస్ (పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్) అనేది మహిళల్లో హార్మోన్ల సమతుల్యత దెబ్బతినడం వల్ల వచ్చే సమస్య. ఇది కేవలం నెలసరి క్రమం తప్పడానికే పరిమితం కాదు. మొటిమలు రావడం, ముఖం లేదా శరీరంపై అవాంఛిత రోమాలు పెరగడం, జుట్టు రాలడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.
PCOS | పీసీఓఎస్ (పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్) అనేది మహిళల్లో హార్మోన్ల సమతుల్యత దెబ్బతినడం వల్ల వచ్చే సమస్య. ఇది కేవలం నెలసరి క్రమం తప్పడానికే పరిమితం కాదు. మొటిమలు రావడం, ముఖం లేదా శరీరంపై అవాంఛిత రోమాలు పెరగడం, జుట్టు రాలడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఈ సమస్యకు ప్రధాన కారణాల్లో ఇన్సులిన్ నిరోధకత ఒకటని పోషకాహార నిపుణులు వివరిస్తున్నారు. శరీరం ఇన్సులిన్‌కు సరిగ్గా స్పందించనప్పుడు హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడుతుంది. ఫలితంగా ఆండ్రోజెన్ హార్మోన్ల స్థాయిలు పెరుగుతాయి. వీటిని సాధారణంగా పురుష హార్మోన్లుగా పిలిచినప్పటికీ మహిళల్లోనూ సహజంగానే కొంతమేర ఉత్పత్తి అవుతాయి.
లక్షణాలు ఎలా ఉంటాయి..
ఆండ్రోజెన్ హార్మోన్లు అధికంగా ఉన్నప్పుడు ముఖం, శరీరంపై అవాంఛిత రోమాలు పెరగడం, మొటిమలు రావడం, జుట్టు పలుచబడడం లేదా ఎక్కువగా రాలడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అల్ట్రాసౌండ్ పరీక్షలో అండాశయాల్లో చిన్న చిన్న తిత్తులు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ హార్మోన్ల అసమతుల్యత నెలసరి క్రమాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఫలితంగా నెలసరి సరిగా రాకపోవడం, అండం విడుదలయ్యే ప్రక్రియలో ఆటంకాలు ఏర్పడతాయి. ఇన్సులిన్ నిరోధకత, ఆండ్రోజెన్ హార్మోన్ల పెరుగుదల ఒకదానితో మరొకటి సంబంధం కలిగి ఉండడడంతో పీసీఓఎస్ లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కోలా కనిపిస్తాయి.
వైద్యులను ఎప్పుడు సంప్రదించాలి..
పీసీఓఎస్ ఉన్న మహిళల్లో అండం విడుదలయ్యే ప్రక్రియ సక్రమంగా జరగకపోవడం వల్ల గర్భం దాల్చడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఈ సమస్య ఉన్నంత మాత్రాన సంతానలేమి వస్తుందని భావించకూడదు. నెలసరి, అండం విడుదల, సంతానోత్పత్తిపై దీని ప్రభావం వ్యక్తిని బట్టి మారుతుంది. కాబట్టి నెలసరి క్రమం తప్పడం, మొటిమలు ఎక్కువగా రావడం, అవాంఛిత రోమాలు పెరగడం, జుట్టు రాలడం వంటి లక్షణాలు నిరంతరం కనిపిస్తే వైద్యులను సంప్రదించాలి. లక్షణాలను బట్టి మాత్రమే పీసీఓఎస్ ఉందని నిర్ధారించలేం. అవసరమైన వైద్య పరీక్షల ద్వారా సమస్యను గుర్తించాలి.
మార్సులను గమనించాలి..
పీసీఓఎస్ అనేది కేవలం నెలసరి సమస్య కాదని, ఇన్సులిన్ నిరోధకత, ఆండ్రోజెన్ హార్మోన్ల పెరుగుదల వల్ల శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయని పోషకాహార నిపుణులు వివరిస్తున్నారు. ఇవి నెలసరి క్రమం, అండం విడుదల, చర్మం, జుట్టు పెరుగుదల, బరువుపై ప్రభావం చూపిస్తాయి. మహిళలు తమ శరీరంలో కనిపించే మార్పులను గమనిస్తూ, సమస్య ఉన్నట్లు అనిపిస్తే వైద్యులతో చర్చించాలి. సరైన సమయంలో పరీక్షలు చేయించుకోవడం వల్ల లక్షణాలకు గల కారణాలను అర్థం చేసుకుని తగిన నిర్వహణ మార్గాలను ఎంచుకోవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PCOS | పీసీఓఎస్ సమస్య మహిళల్లో అసలు ఎందుకు వస్తుంది.. ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..?
Rising Stars Asia Cup: రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌కు తిలక్ వర్మ కెప్టెన్సీ.. జట్టులో అభిషేక్, వైభవ్
RJD Somireddy | విద్యా ప్రమాణాల పెంపునకు సమష్టి కృషి చేయాలి : ఆర్జేడీ సోమిరెడ్డి
Sharad Pawar | శరద్ పవార్‌కు ఛాతిలో నొప్పి.. పూణె ఆసుపత్రిలో చేరిక, నిలకడగా ఆరోగ్యం
daughter kills father | ఫోన్‌ను నేలకు విసిరికొట్టిన తండ్రి.. కుక్కర్ మూతతో తలపై కొట్టి, కత్తితో పొడిచి చంపిన కుమార్తె
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

