daughter kills father | ఫోన్‌ను నేలకు విసిరికొట్టిన తండ్రి.. కుక్కర్ మూతతో తలపై కొట్టి, కత్తితో పొడిచి చంపిన కుమార్తె
daughter kills father | ఇంట్లో పనులు చేయకపోవడంపై కుమార్తెను తండ్రి మందలించాడు. ఈ గొడవ సందర్భంగా ఆమె మొబైల్ ఫోన్ లాక్కొని నేలకేసి కొట్టాడు. ఆగ్రహించిన కుమార్తె కుక్కర్ మూతతో తండ్రి తలపై పలుసార్లు కొట్టింది. కత్తితో పొడిచి ఆయనను హత్య చేసింది.
గాంధీనగర్: ఇంట్లో పనులు చేయకపోవడంపై కుమార్తెను తండ్రి మందలించాడు. ఈ గొడవ సందర్భంగా ఆమె మొబైల్ ఫోన్ లాక్కొని నేలకేసి కొట్టాడు. ఆగ్రహించిన కుమార్తె కుక్కర్ మూతతో తండ్రి తలపై పలుసార్లు కొట్టింది. కత్తితో పొడిచి ఆయనను హత్య చేసింది. పోలీసులు ఆ యువతిని అరెస్ట్ చేశారు. (daughter kills father) గుజరాత్‌లోని సూరత్‌లో ఈ సంఘటన జరిగింది. అక్టోబర్ 31న రాత్రి 10.30 గంటల సమయంలో అమ్రోలి ప్రాంతంలో నివసించే రమేష్‌సింగ్ కైలాష్సింగ్ రాజ్‌పుత్, తన భార్య మంజుబెన్, చిన్న కుమార్తె కాజల్‌తో ఇంటి విషయాల గురించి మాట్లాడాడు. ఇంటి పనులు చేయకపోవడంపై కుమార్తెను ఆయన మందలించాడు. ఆమె చేతిలోని మొబైల్ ఫోన్ లాక్కుని నేలకేసి కొట్టాడు.
కాగా, తండ్రి రమేష్‌సింగ్ చేసిన పనికి కుమార్తె కాజల్ తీవ్ర ఆగ్రహానికి గురైంది. వెంటనే వంటగదిలోని ప్రెషర్ కుక్కర్ మూత తీసుకొచ్చి ఆయన తలపై పదేపదే కొట్టింది. ఆ తర్వాత కత్తితో తండ్రి కడుపులో ఆమె పొడవడంతో తీవ్ర రక్తస్రావమై ఆయన కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే 108 అంబులెన్స్ సర్వీస్‌కు సమాచారం అందించారు. వైద్య సిబ్బంది అక్కడకు చేరుకుని రమేష్సింగ్ను పరీక్షించారు. అప్పటికే ఆయన మరణించినట్లు నిర్ధారించారు.
మరోవైపు తల్లి మంజుబెన్ తన కుమార్తె కాజల్‌పై అమ్రోలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో 22 ఏళ్ల యువతిపై హత్య కేసు నమోదు చేయడంతో పాటు ఆమెను అరెస్ట్ చేశారు. జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. తండ్రి హత్యకు దారితీసిన పరిస్థితులు, ఇంట్లో జరిగిన సంఘటనల క్రమంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- cooker lid
- Daughter
- Father
- Floor
RELATED ARTICLES
తాజా వార్తలు
daughter kills father | ఫోన్‌ను నేలకు విసిరికొట్టిన తండ్రి.. కుక్కర్ మూతతో తలపై కొట్టి, కత్తితో పొడిచి చంపిన కుమార్తె
‘తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి’
‘మహిళలు వృత్తి విద్యా కోర్సులను సద్వినియోగం చేసుకోవాలి’
నిరుపేద కుటుంబాలకు ‘మేవా’ ఆర్ధిక సాయం
‘రైతు సంక్షేమమే లక్ష్యంగా కృషి విజ్ఞాన కేంద్రం సేవలు’
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

