Sharad Pawar | శరద్ పవార్‌కు ఛాతిలో నొప్పి.. పూణె ఆసుపత్రిలో చేరిక, నిలకడగా ఆరోగ్యం
Sharad Pawar | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) వ్యవస్థాపకుడు, ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ సోమవారం దగ్గు, ఛాతిలో నొప్పితో బాధపడ్డారు. ఈ నేపథ్యంలో పూణేలోని రూబీ హాల్ క్లినిక్‌లో ఆయనను చేర్పించారు. తన తండ్రి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నదని ఆయన కుమార్తె సుప్రియా సూలే తెలిపారు.
ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) వ్యవస్థాపకుడు, ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ సోమవారం దగ్గు, ఛాతిలో నొప్పితో బాధపడ్డారు. ఈ నేపథ్యంలో పూణేలోని రూబీ హాల్ క్లినిక్‌లో ఆయనను చేర్పించారు. (Sharad Pawar) తన తండ్రి శరద్ పవార్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నదని ఆయన కుమార్తె, ఎన్పీపీ(ఎస్పీ) ఎంపీ సుప్రియా సూలే తెలిపారు. ప్రస్తుతం ఆయనకు వైద్య పరీక్షలు జరుగుతున్నాయని చెప్పారు. ‘నాన్నకు దగ్గు రావడంతో పూణేలోని రూబీ హాల్ క్లినిక్‌లో చేర్పించాం. ఆయనకు వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. ఆయన ఆరోగ్య సూచనలు నిలకడగా ఉన్నాయి. మీ అందరి ఆందోళనకు ధన్యవాదాలు’ అని ఎక్స్ పోస్ట్‌లో ఆమె పేర్కొన్నారు.
కాగా, ప్లూరిటిక్ చెస్ట్ పెయిన్ (శ్వాస తీసుకునేటప్పుడు తీవ్రమయ్యే ఛాతి నొప్పి) వల్ల ఆరోగ్య పరీక్షలు, వైద్య పర్యవేక్షణ కోసం శరద్ పవార్‌ను ఆసుపత్రిలో చేర్చినట్లు రూబీ హాల్ క్లినిక్ చీఫ్ కార్డియాలజిస్ట్, చైర్మన్ అయిన డాక్టర్ పర్వేజ్ కె. గ్రాంట్ తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుందని ఆశిస్తున్నామని చెప్పారు. ముందు జాగ్రత్త చర్యగా శరద్ పవార్‌ను వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్లు వివరించారు.
అయితే, 85 ఏళ్ల శరద్ పవార్, ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా రెండుసార్లు ఆసుపత్రిలో చేరారు. 2023లో అజిత్ పవార్ ఎన్సీపీని చీల్చిన తర్వాత, ప్రస్తుతం ఎన్సీపీ (ఎస్పీ)కి ఆయన నేతృత్వం వహిస్తున్నారు.
Baba has been admitted to Ruby Hall Clinic, Pune, following a bout of cough. He is undergoing medical tests, and all his health parameters are stable.
Thank you all for your concern and good wishes.
— Supriya Sule (@supriya_sule) November 2, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sharad Pawar | శరద్ పవార్‌కు ఛాతిలో నొప్పి.. పూణె ఆసుపత్రిలో చేరిక, నిలకడగా ఆరోగ్యం
daughter kills father | ఫోన్‌ను నేలకు విసిరికొట్టిన తండ్రి.. కుక్కర్ మూతతో తలపై కొట్టి, కత్తితో పొడిచి చంపిన కుమార్తె
‘తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి’
‘మహిళలు వృత్తి విద్యా కోర్సులను సద్వినియోగం చేసుకోవాలి’
నిరుపేద కుటుంబాలకు ‘మేవా’ ఆర్ధిక సాయం
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

