Rising Stars Asia Cup: రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌కు తిలక్ వర్మ కెప్టెన్సీ.. జట్టులో అభిషేక్, వైభవ్
Rising Stars Asia Cup: మెన్స్ రైజింగ్ స్టార్ ఆసియాకప్ టోర్నీ కోసం ఇండియా-ఏ జట్టును ప్రకటించారు. భారత జట్టులో అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీని ఎంపిక చేశారు. 15 మంది సభ్యులతో కూడిన ఇండియా-ఏ జట్టును ఇవాళ బీసీసీఐ ప్రకటించింది. తిలక్ వర్మను కెప్టెన్‌గా నియమించారు.
న్యూఢిల్లీ: రైజింగ్ స్టార్ ఆసియాకప్(Rising Stars Asia Cup) మెన్స్ టోర్నీ కోసం ఇండియా-ఏ జట్టును ప్రకటించారు. భారత జట్టులో అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీని ఎంపిక చేశారు. 15 మంది సభ్యులతో కూడిన ఇండియా-ఏ జట్టును ఇవాళ బీసీసీఐ ప్రకటించింది. తిలక్ వర్మను కెప్టెన్‌గా నియమించారు. రజిత్ పటిదార్ వైస్ కెప్టెన్సీ చేయనున్నారు. నవంబర్ 19 నుంచి 29 వరకు ఖతార్‌లో ఈ టోర్నీ జరగనున్నది. ఇటీవల కివీస్‌తో జరిగిన సిరీస్‌లో ఆడిన భారత జట్టు బృందంలోని ఆటగాళ్లు ఇండియా-ఏ జట్టులో చోటు దక్కించుకున్నారు. యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీపైనే ఫోకస్ పెట్టారు.
ఫినిషర్ పాత్రను రింకూ సింగ్ పోషించనున్నాడు. ప్రభ్‌సిమ్రన్, కుమార కుషాగ్రా ..కీపింగ్ బాధ్యతలను చేపట్టనున్నారు. సూర్యాంశ్ షెడ్జ్, షాబాజ్ అహ్మద్, విప్రాజ్ నిగం, హర్షదూబే, తనుష్ కోటియాన్.. ఆల్రౌండర్లుగా బరిలోకి దిగనున్నారు. పేస్ బౌలింగ్‌లో హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్, అర్షద్ ఖాన్ ఉన్నారు. భారత జట్టు గ్రూపు బిలో ఉన్నది. దాంట్లో పాక్, నేపాల్, యూఏఈ జట్లు ఉన్నాయి. నవంబర్ 20న నేపాల్‌తో ఇండియా తొలి మ్యాచ్ ఆడనున్నది. గ్రూపు ఏలో బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, హాంగ్‌కాంగ్, చైనా ఉన్నాయి.
🚨 News 🚨
India A squad for upcoming ACC Rising Stars Asia Cup announced 📝
More details ▶️ https://t.co/JRdPQ31UPA
#RisingStarsAsiaCup https://t.co/4k2vJAE4kh
— BCCI (@BCCI) November 2, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rising Stars Asia Cup: రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌కు తిలక్ వర్మ కెప్టెన్సీ.. జట్టులో అభిషేక్, వైభవ్
RJD Somireddy | విద్యా ప్రమాణాల పెంపునకు సమష్టి కృషి చేయాలి : ఆర్జేడీ సోమిరెడ్డి
Sharad Pawar | శరద్ పవార్‌కు ఛాతిలో నొప్పి.. పూణె ఆసుపత్రిలో చేరిక, నిలకడగా ఆరోగ్యం
daughter kills father | ఫోన్‌ను నేలకు విసిరికొట్టిన తండ్రి.. కుక్కర్ మూతతో తలపై కొట్టి, కత్తితో పొడిచి చంపిన కుమార్తె
‘తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

