US Iran Ceasefire | అర్ధరాత్రి ఇరాన్ నాగరికత లేకుండా చేస్తానని హెచ్చరించిన కొద్దిగంటల్లోనే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఇరాన్‌తో రెండు వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించారు. ఈ విషయాన్ని తన సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు. అయితే ఈ ఒప్పందంలో ఇజ్రాయెల్ కూడా భాగమేనని వైట్ హౌస్ అధికారి ఒకరు వెల్లడించారు.
ఇరాన్‌తో అమెరికా చర్చలు జరుగుతున్న సమయంలోనే ఇజ్రాయెల్ కూడా దాడులను నిలిపిసేందుకు అంగీకరించిందని వైట్‌హౌస్ అధికారి తెలిపారు. ఇజ్రాయెల్ ప్రభుత్వ ప్రసార సంస్థ Kan కూడా ఈ విషయాన్ని ప్రసారం చేశాయి. కాగా, కాల్పులను నిలిపివేయాలని సైన్యానికి ఎలాంటి ఆదేశాలు జారీ కాలేదని పలు నివేదికలు వెల్లడించడం గమనార్హం. ఈ విషయంపై అటు అమెరికా, ఇటు ఇజ్రాయెల్ అధికారికంగా ఎలాంటి ధ్రువీకరణ ఇవ్వలేదు.
అయితే, ఈ కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించిన తర్వాత కూడా ఇజ్రాయెల్, యూఏఈపై ఇరాన్ దాడులకు పాల్పడింది. రెండు దేశాలపైకి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. కాగా, ఆ మిస్సైళ్లను ఆయా దేశాలు సమర్థంగా అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్షిపణి దాడులపై పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.
దీంతో ఈ సీజ్ఫైర్లో ఇజ్రాయెల్ భాగమా? కాదా? అనే అనిశ్చితి కొనసాగుతోంది.
కాగా, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాత్రం ఈ సీజ్‌ఫైర్‌ను డబుల్ సైడెడ్ సీజ్ఫైర్గా పేర్కొన్నారు. ఇరాన్ నుంచి 10 సూత్రాలతో ఒక ప్రతిపాదన అందిందని.. దానిపై సానుకూలంగా చర్చలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. గతంలో ఉన్న వివాదాస్పద అంశాల్లో చాలా వాటిపై రెండు దేశాల మధ్య అంగీకారం కుదిరిందని తెలిపారు. ఈ రెండు వారాల వ్వయధిలో తుది ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. మధ్యప్రాచరయంలో శాంతి స్థాపనకు ఇది కీల ముందడుగు కానుందన్నారు. దీర్ఘకాల సమస్యలకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.