US Iran Ceasefire | ఇరాన్‌తో యుద్ధానికి మళ్లీ బ్రేక్ ఇచ్చిన ట్రంప్.. రెండు వారాల పాటు కాల్పుల విరమణ
US Iran Ceasefire | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్‌పై అర్ధరాత్రి జరగాల్సిన దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సోషల్‌మీడియా వేదికగా ప్రకటించారు. రెండు వారాల పాటు కాల్పుల విరమణ అమల్లో ఉంటుందని తెలిపారు.
US Iran Ceasefire | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్‌పై అర్ధరాత్రి జరగాల్సిన దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సోషల్‌మీడియా వేదికగా ప్రకటించారు. రెండు వారాల పాటు కాల్పుల విరమణ అమల్లో ఉంటుందని తెలిపారు.
పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, సైన్యాధ్యక్షుడు ఆసిమ్ మునీర్‌తో చర్చల అనంతరం ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్‌పై ఈ రాత్రి జరగాల్సిన దాడులను నిలిపివేయాలని వారు చేసిన ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పారు. హోర్ముజ్ జలసంధిని తక్షణమే తెరవాలన్న షరతుకు లోబడి రెండు వారాల గడువు ఇచ్చేందుకు, కాల్పుల విరమణకు అంగీకరించానని ట్రంప్ తెలిపారు.
ఇరాన్ నుంచి 10 సూత్రాలతో ఒక ప్రతిపాదన అందిందని.. దానిపై సానుకూలంగా చర్చలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. గతంలో ఉన్న వివాదాస్పద అంశాల్లో చాలా వాటిపై రెండు దేశాల మధ్య అంగీకారం కుదిరిందని తెలిపారు. ఈ రెండు వారాల వ్వయధిలో తుది ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. మధ్యప్రాచరయంలో శాంతి స్థాపనకు ఇది కీల ముందడుగు కానుందన్నారు. దీర్ఘకాల సమస్యలకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ధ్రువీకరించిన ఇరాన్
కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ కూడా ధ్రువీకరించింది. పాక్ మధ్యవర్తిత్వంతో ఈ ఒప్పందం కుదురిందని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ నిర్ధారించింది. ఈ మేరకు మెహర్ న్యూస్ ఏజెన్సీ ద్వారా ఒక ప్రకటన విడుదల చేసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donga Naa Koduku | ‘లిటిల్ హార్ట్స్’ ఫేమ్ మౌళి కొత్త సినిమా.. ‘దొంగ నా కొడుకు’ ట్రైలర్ రిలీజ్
Protocol 32 | ఒకే సాచెట్లో 32 రకాల పోషకాలు.. కొత్త సప్లిమెంట్‌ను ఆవిష్కరించిన యువరాజ్ సింగ్..
Ram Charan | ‘ఇట్లు అర్జున’ ఈవెంట్లో రామ్ చరణ్ టంగ్ స్లిప్.. ‘కాకా’ మూవీపై బిగ్ అప్డేట్!
Medchal | పోలీస్ స్టేషన్ పక్కనే భారీ చోరీ.. జ్యువెల్లరీ షాప్ గోడకు కన్నం వేసి ఆభరణాలు ఎత్తుకెళ్లిన దొంగలు!
YSRCP | పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దు.. శ్రేణులకు వైఎస్ఆర్సీపీ ఆదేశాలు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

