ఏది మంచిది : ఎన్-95 మాస్క్ ధరించవచ్చా..?
కరోనా ఇన్ఫెక్షన్ను నివారించడంలో మెరుగైన ఫిట్టింగ్ మాస్క్‌లు మరింత సమర్థంగా ఉంటాయని కొత్త అధ్యయనం తెలిపింది.

వాషింగ్టన్ : కరోనా వైరస్ నివారణలో మాస్క్‌ల పాత్ర ఎంతో ముఖ్యమైనది. మాస్క్‌లకు సంబంధించి ఎప్పటికప్పుడు అధ్యయనాలు జరుగుతున్నాయి. కరోనా ఇన్ఫెక్షన్ను నివారించడంలో మెరుగైన ఫిట్టింగ్ మాస్క్‌లు మరింత సమర్థంగా ఉంటాయని కొత్త అధ్యయనం తెలిపింది. ముఖం మీద మాస్క్ ధరించడం వల్ల కరోనా బారిన పడే ప్రమాదం పెరుగుతున్నదని, ఈ వైరస్ నివారణలో మాస్క్‌లు ముఖ్యమని మునుపటి అధ్యయనాల నుంచి రుజువైంది. అందుకని ప్రజలు మాస్క్‌లు ధరించాలని, చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, నిర్ణీత శారీరక దూర నియమాలను పాటించాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
అమెరికాలోని సిన్సినాటి విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఏ మాస్క్ అనువైనదిగా ఉంటుంది అనే అంశంపై అధ్యయనం జరిపారు. ముఖం-వస్త్రం మధ్య వ్యత్యాసాన్ని కొలవడానికి వారు మూడు వేర్వేరు పరిమాణంలో ఉన్న N95 మాస్క్‌లను అధ్యయనం చేశారు. ముఖం-మాస్క్ మధ్య ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని లెక్కించడానికి పరిశోధకులు సీటీ స్కాన్లను ఉపయోగించారు. ముఖానికి సరైన ఫిట్టింగ్ మాస్క్ ధరించకపోవడం వల్ల ముక్కు చుట్టూ గ్యాప్‌కు దారితీస్తుందని వారు గుర్తించారు.
సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం, సరైన సైజు N-95 మాస్క్‌లను ధరించకపోవడం వల్ల ఇన్ఫెక్షన్ ప్రమాదం ఎక్కువగా ఉన్నది. ‘ఫేస్ మాస్క్ అమర్చడం చాలా ముఖ్యమైనదని చాలా మందికి అర్థం కాలేదు. సరిగ్గా అమర్చకపోవడం వల్ల మాస్క్, ముఖం మధ్య గ్యాప్ ఉంటుంది. ఇది మిమ్మల్ని కరోనా వైరస్ బారిన పడేలా చేస్తుంది అని అధ్యయనంలో పాల్గొన్న సిన్సినాటి విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ రూపక్ బెనర్జీ పేర్కొన్నారు.
మునుపటి అధ్యయనంలో సహజ సిల్క్ లేదా ఫైన్ మెష్ ఫాబ్రిక్‌తో పత్తి కలయిక ఏరోసోల్‌లను ఫిల్టర్ చేయగలదని పరిశోధకులు పేర్కొన్నారు. నోరు సరిగ్గా మాస్క్‌తో కప్పబడి ఉంటుంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి ప్రధాన కారణం సోకిన వ్యక్తి దగ్గు, తుమ్ము లేదా మాట్లాడేటప్పుడు నోటి నుంచి వచ్చే తుంపరలు. వైరస్ సోకిన వ్యక్తి నోరు సరిగ్గా మాస్క్‌తో కప్పుకుని ఉంటే వైరస్ వ్యాప్తికి చాలా వరకు అడ్డుకట్ట వేయవచ్చును.
ఇవి కూడా చదవండి..
తొలి వ్యక్తి : న్యూజెర్సీ ఫెడరల్ జడ్జిగా ముస్లిం వ్యక్తి నియామకం
డిజైన్ 2021: పుణె మ్యూజిక్ యాప్ ‘నాద్సాధన్’కు ఆపిల్ అవార్డ్
వ్యాప్తి అంచనా : ఈ నెలలో ఐసీఎంఆర్ సెరో సర్వే
నిజంగా నిజం : కరోనాపై సోషల్ మీడియాలో అన్నీ తప్పుడు రాతలే!
కరోనా సోమ్నియా : నిద్ర సమస్యలను ఇలా నివారించుకోండి..
డెల్టా వేరియంట్ : బ్రిటన్‌లో దర్యాప్తునకు రంగంలోకి సైన్యం
ఇప్పుడేమంటారు : ఆఫ్ఘాన్ జైళ్లలో ఉగ్రవాదులతో సంబంధమున్న పాక్ మహిళలు
యూపీ విభజన : యోగీ ఢిల్లీ పర్యటన అందుకేనా..?
చరిత్రలో ఈరోజు : 41 ఏండ్ల క్రితమే హాంకాంగ్ ఫ్లూ మహమ్మారి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

