MLC Farooq Hussain | రాయపోల్, సెప్టెంబర్ 28 : దసరా పండుగ సందర్భంగా సోమవారం రాయపోల్ మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ 20 మందికి నూతన వస్త్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పదవులు ఎప్పటికీ శాశ్వతం కాదని ఉన్నప్పుడు ప్రజల హృదయాలను గెలుచుకోవాలని అప్పుడే ప్రజలు గుర్తిస్తారని పేర్కొన్నారు. ఈ ప్రాంత ప్రజలతో గత 30 ఏళ్ల అనుబంధం ఉందని.. తను సిద్దిపేటలో పుట్టినప్పటికీ మనసంతా దుబ్బాక నియోజకవర్గం ప్రజలపైనే ఉంటుందని గుర్తు చేశారు.
పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా రంజాన్ దసరా పండుగలకు తోచిన విధంగా పేదలకు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు ఫారుఖ్ హుస్సేన్ పేర్కొన్నారు. పేద ప్రజలు ఎక్కడ ఆపద ఉంటే అక్కడ ఫారుఖ్ హుస్సేన్ ఉంటాడని.. పేదలకు సేవ చేయడంలోనే ఎంతో తృప్తి కలుగుతుందని ఆయన అన్నారు.
సమాజంలో ఆత్మగౌరవంగా బతకాలన్నదే..
దుబ్బాక నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పర్యటిస్తూ పేదల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నట్లు పేర్కొన్నారు. దసరా పండుగ సందర్భంగా పలు గ్రామాల్లో పేదలకు బట్టలను అందజేసిన విషయాన్ని గుర్తు చేశారు. తాను ఎన్నికల్లో పోటీ చేయబోనని.. కేసీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు ముందుకు సాగుతున్నట్లు స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రతి మండల కేంద్రంలో శవ పేటికల ఫ్రిజ్‌లను అందించడం జరిగిందని వాటిని మంచిగా కాపాడుకోవాల్సిన బాధ్యత ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, గ్రామస్తులపై ఉందన్నారు.
ప్రతీ గ్రామానికి శవ పేటికల ఫ్రిజ్‌లు దాతల సహకారంతో అందే విధంగా కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. తనకు పదవులు ముఖ్యం కాదని పేద ప్రజలు మూడు పూటలా తిండి.. మంచిగా బట్టలు వేసుకోవడం.. సమాజంలో ఆత్మగౌరవంగా బతకాలన్నదే తన ఆకాంక్ష అని పేర్కొన్నారు. పేదలకు ఎలాంటి ఆపద వచ్చినా ఫోన్ ద్వారా సమాచారం అందిస్తే వెంటనే ఆ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చి తోచిన విధంగా సహాయం అందిస్తామని పేర్కొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండానే..
గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కేసీఆర్ చేపట్టిన అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపలాడడం ఖాయమని.. అభ్యర్థుల తరఫున తాము కూడా ప్రచారం నిర్వహిస్తామని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని.. దీంతో ప్రజల్లో ఆ పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. యూరియా కొరతతో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని దీంతో రైతాంగం కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఆగ్రహంతో ఉన్నారని ఫారూఖ్ హుస్సేన్ పేర్కొన్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకులు రాజిరెడ్డి, ఉమ్మడి మండల బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చింతకింది మంజూరు, మండల నాయకులు రాజు, ప్రకాష్, గ్రామ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Vidadala Rajini | వైసీపీకి షాక్.. విడదల రజినీపై డిజిటల్ బుక్‌లో ఫిర్యాదు!
Modi-Meloni | మెలోనీ ఆత్మకథకు ప్రధాని మోదీ ముందుమాట.. మరోసారి తెరపైకి ‘మెలోడీ’ మూమెంట్
Road Accident | ఆగి ఉన్న ట్రక్కును ఢీ కొట్టిన బస్సు.. ముగ్గురు మృతి