Rahul Gandhi | చింతన్ శివిర్‌కు రైలులో బయలుదేరి వెళ్లిన రాహుల్!
Rahul Gandhi | 3 రోజులు జరిగే చింతన్‌శివిర్ సదస్సు కోసం ఉదయ్‌పూర్‌కు కాంగ్రెస్‌నేత రాహుల్‌గాంధీ రైలులో బయలుదేరి వెళ్లారు.
Rahul Gandhi | శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు జరిగే చింతన్ శివిర్‌లో పాల్గొనేందుకు కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్‌గాంధీ గురువారం ఢిల్లీ నుంచి ఉదయ్‌పూర్‌కు రైలుఉలో బయలుదేరి వెళ్లారు. నవ్ సంకల్ప్ చింతన్ శివిర్ పేరుతో జరుగుతున్న ఈ సదస్సులో పార్టీ పూర్వ వైభవానికి తీసుకోవాల్సిన చర్యలు, అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారని సమాచారం. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం తర్వాత త్వరలో చింతన్ శివిర్ సదస్సు ఉంటుందని ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రకటించారు.
రాహుల్‌గాంధీతోపాటు 75 మంది పార్టీ నేతలు ఢిల్లీ నుంచి ఉదయ్‌పూర్‌కు రైలులో బయలుదేరి వెళ్లారు. ఈ సదస్సులో రాజకీయాలు, ఆర్గనైజేషన్, ఎకానమీ, సాంఘిక సంక్షేమం, యువత, వ్యవసాయం తదితర అంశాలపై చర్చిస్తారని సమాచారం. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలి ఆహ్వానం అందుకున్న వారంతా ఈ సదస్సుకు హాజరవుతారు. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తో గాంధీల భేటీ తర్వాత ఈ చింతన్ శివిర్ జరుగుతుండటం గమనార్హం.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

