Almonds | రోజూ కొన్ని బాదంపప్పులను తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఇవే.. అధ్యయనాల్లో తేలిన నిజాలు..
రోజూ కొన్ని బాదంపప్పులు తినడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయని జీర్ణకోశ నిపుణులు చెబుతున్నారు. పోషకాలు సమృద్ధిగా ఉండే బాదంపప్పులను సులభంగా వెంట తీసుకెళ్లవచ్చు. సమయం తక్కువగా ఉన్నప్పుడు మంచి చిరుతిండిగా కూడా వీటిని తీసుకోవచ్చు. బాదంపప్పులను క్రమం తప్పకుండా తింటే శరీరంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో వైద్య నిపుణులు వివరించారు.
Almonds | రోజూ కొన్ని బాదంపప్పులు తినడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయని జీర్ణకోశ నిపుణులు చెబుతున్నారు. పోషకాలు సమృద్ధిగా ఉండే బాదంపప్పులను సులభంగా వెంట తీసుకెళ్లవచ్చు. సమయం తక్కువగా ఉన్నప్పుడు మంచి చిరుతిండిగా కూడా వీటిని తీసుకోవచ్చు. బాదంపప్పులను క్రమం తప్పకుండా తింటే శరీరంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో వైద్య నిపుణులు వివరించారు.
కొలెస్ట్రాల్ తగ్గేందుకు..
బాదంపప్పులు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఒక విశ్లేషణ ప్రకారం.. వీటిని తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్) స్థాయిలు ప్రతి డెసిలీటర్కు సుమారు 5 మిల్లీగ్రాముల మేర తగ్గినట్లు గుర్తించారు. అలాగే సుమారు 23 బాదంపప్పులు తింటే దాదాపు 4 గ్రాముల పీచు పదార్థం లభిస్తుంది. ఇది జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. కార్బొహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారంతోపాటు బాదంపప్పులు తీసుకుంటే భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా సహాయపడతాయి. ఒక గుప్పెడు బాదంపప్పుల ద్వారా సుమారు 6 గ్రాముల మాంసకృత్తులు, ఆరోగ్యకరమైన కొవ్వులు లభిస్తాయి. ఇవి ఎక్కువసేపు ఆకలి వేయకుండా కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. చర్మ ఆరోగ్యానికి కూడా ఇవి ఉపయోగపడతాయని ఒక అధ్యయనం సూచించింది. 24 వారాల పాటు బాదంపప్పులు తీసుకున్నవారిలో ముడతల తీవ్రత 16 శాతం తగ్గినట్లు ఆ అధ్యయనంలో గుర్తించారు.
ఆరోగ్యకరమైన అలవాట్లు అవసరం..
బాదంపప్పులతోపాటు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే మరికొన్ని అలవాట్లను కూడా నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం నిద్రలేవగానే ఫోన్ చూడకుండా, కృతజ్ఞతగా భావించే విషయాలను కొద్దిసేపు గుర్తుచేసుకోవాలని చెబుతున్నారు. ఉదయం సుమారు 10 నిమిషాల పాటు సూర్యరశ్మిలో గడపడం వల్ల మానసిక స్థితి మెరుగుపడటంతోపాటు విటమిన్ డి స్థాయిలకు, శరీర జీవగడియారానికి మేలు కలుగుతుంది. భోజనం చేసిన తర్వాత కొద్దిసేపు నడవడం జీర్ణక్రియకు సహాయపడుతుంది. పెరుగు, కేఫీర్, కిమ్చీ వంటి ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల పేగుల్లో మేలు చేసే సూక్ష్మజీవుల పెరుగుదలకు తోడ్పడుతుంది. పసుపు, అల్లం, జీలకర్ర, సోంపు వంటి సుగంధ ద్రవ్యాలను ఆహారంలో చేర్చుకోవడం కూడా జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది.
భోజనాల మధ్య విరామం ఉండాలి..
రోజులో మొదటి భోజనం నుంచి చివరి భోజనం వరకు 12 గంటల విరామం ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే బెర్రీ పండ్లను ఆహారంలో చేర్చుకోవాలని, శరీర అవసరాలకు అనుగుణంగా ఆహారాన్ని ఎంచుకోవాలని చెబుతున్నారు. అయితే, ప్రతి ఒక్కరి పోషక అవసరాలు ఒకేలా ఉండవు కాబట్టి ఆహారపు అలవాట్లను వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవడం ముఖ్యమని వారు సూచిస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Almonds | రోజూ కొన్ని బాదంపప్పులను తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఇవే.. అధ్యయనాల్లో తేలిన నిజాలు..
Sheikh Hasina | తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ ఇవ్వండి.. బంగ్లాదేశ్‌ను కోరిన షేక్ హసీనా..!
కారేపల్లి ఎస్ఐగా రమేశ్ బాధ్యతలు స్వీకరణ
Raipur man jailed in Russia | ఉద్యోగం కోసం రష్యా వెళ్లిన వ్యక్తి.. డ్రగ్స్ కేసులో అరెస్ట్, ఆర్మీలో చేరాలని ఒత్తిడి
Census 2027 | తెలంగాణలో జనగణనకు నోటిఫికేషన్ జారీ.. తేదీలు ఇవే
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

