Raipur man jailed in Russia | ఉద్యోగం కోసం రష్యా వెళ్లిన వ్యక్తి.. డ్రగ్స్ కేసులో అరెస్ట్, ఆర్మీలో చేరాలని ఒత్తిడి
Raipur man jailed in Russia | ఒక వ్యక్తి ఉద్యోగం కోసం రష్యా వెళ్లాడు. అయితే డ్రగ్స్ కేసులో అతడ్ని రష్యా పోలీసులు అరెస్ట్ చేశారు. జైలులో ఉంటావా లేక ఆర్మీలో చేరి యుద్ధంలో పాల్గొంటావా అని తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్లు అతడి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. సహాయం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాశారు.
రాయ్‌పూర్: ఒక వ్యక్తి ఉద్యోగం కోసం రష్యా వెళ్లాడు. అయితే డ్రగ్స్ కేసులో అతడ్ని రష్యా పోలీసులు అరెస్ట్ చేశారు. జైలులో ఉంటావా లేక ఆర్మీలో చేరి యుద్ధంలో పాల్గొంటావా అని తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్లు అతడి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. సహాయం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాశారు. (Raipur man jailed in Russia) ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌కు చెందిన రిటైర్డ్ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ కుమారుడైన 38 ఏళ్ల టికేశ్వర్ సాహు, సెప్టెంబరు 8న పర్యాటక వీసాపై రష్యా వెళ్లాడు. సెప్టెంబరు 16 తర్వాత కుటుంబ సభ్యులకు అతడితో సంబంధాలు తెగిపోయాయి. ఆందోళన చెందిన ఆ కుటుంబం రష్యాలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించింది.
కాగా, మాదకద్రవ్యాలకు సంబంధించిన ఒక తీవ్రమైన కేసులో రష్యా పోలీసులు టికేశ్వర్ను అరెస్ట్ చేసినట్లు అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో అతడికి 20 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు బెదిరిస్తున్నారని, అలాగే రష్యా సైన్యంలో చేరి యుద్ధంలో పాల్గొనాలంటూ అతడిపై ఒత్తిడి తెస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
మరోవైపు రష్యాలోని వోల్గోగ్రాడ్‌లో పోలీసుల అదుపులో ఉన్న టికేశ్వర్ భద్రత, చట్టపరమైన హక్కుల కోసం తాము ఆందోళన చెందుతున్నట్లు అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. న్యాయపోరాటం కోసం రష్యాలో ఒక ప్రైవేట్ న్యాయవాదిని కూడా నియమించినట్లు పేర్కొన్నారు.
అలాగే రష్యా జైలులో ఉన్న టికేశ్వర్ను విడుదల చేయించాలని, సురక్షితంగా భారత్‌కు తీసుకువచ్చేందుకు సహాయం చేయాలని కోరుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వారు ఆశ్రయించారు. టికేశ్వర్ భార్య మనోరమ ఇటీవల ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని హోంశాఖ పరిశీలిస్తున్నదని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- drug charge
- family
- Govt Help
- jailed
RELATED ARTICLES
తాజా వార్తలు
Raipur man jailed in Russia | ఉద్యోగం కోసం రష్యా వెళ్లిన వ్యక్తి.. డ్రగ్స్ కేసులో అరెస్ట్, ఆర్మీలో చేరాలని ఒత్తిడి
Census 2027 | తెలంగాణలో జనగణనకు నోటిఫికేషన్ జారీ.. తేదీలు ఇవే
‘నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలి’
రాష్ట్రస్థాయి బాలికల కబడ్డీ విజేత నల్లగొండ జట్టు
Health tips | రోజుకో బాయిల్డ్ ఎగ్ తింటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు.. అవేంటో తెలుసా..?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

