సెయింట్‌జాన్స్(ఆంటిగ్వా): ప్రపంచకప్‌లో ఆడాలన్నది ప్రతి క్రికెటర్ కల. అయితే అవాంతరాల కారణంగా జట్టులో చోటు కోల్పోతే ఆ క్రికెటర్ బాధ వర్ణణాతీతం. వెస్టిండీస్ హార్డ్‌హిట్టర్ షిమ్రాన్ హెట్మెయిర్కు ఇలాంటి పరిస్థితే ఎదురైంది.
సకాలంలో విమా నం అందుకోలేకపోవడంతో అతడు జట్టులో చోటు కోల్పోయాడు. ప్రపంచకప్‌నకు ముందు విండీస్ జట్టు ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆడనున్నది. అందుకోసం విండీస్ జట్టు ఆస్ట్రేలియా బయలుదేరి వెళ్లింది. అయితే కుటుంబ కారణాల రీత్యా హెట్మెయిర్ ఆస్ట్రేలియా కు వెళ్లలేకపోయాడు. అతడు విమానం మిస్సవడంతో విండీస్ బోర్డు అతని స్థానంలో బ్రూక్స్‌ను జట్టులోకి తీసుకుంది.