citu | తెలంగాణ చౌక్, కరీంనగర్, ఏప్రిల్ 6 : సీఐటీయూ తొలి అధ్యక్షుడు కామ్రేడ్ బీటీ ఆశయాలను కొనసాగిస్తామని ఆ యునియన్ జిల్లా అధ్యక్షుడు ఏడ్ల రమేష్ పేర్కొన్నారు. రణదివే వర్ధంతి కార్యక్రమం సీఐటీయూ జిల్లా కార్యాలయంలో జరిగింది.
జిల్లా అధ్యక్షుడు ముకుంద రెడ్డి, జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేష్, సీఐటీయూ నగర కార్యదర్శి పుల్లెల మల్లయ్య నాయకులు మోహన్ రెడ్డి, జగదీశ్ లు ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కామ్రేడ్ బీటీ రణదేవ్ ఉన్నత విద్యావంతుడైన బీటీ ఆర్ ఉద్యోగాలను వదిలి క్రియాశీల రాజకీయాలకు పనిచేయాలని నిర్ణయించుకున్నాడన్నారు. కార్పొరేట్ సంస్థల కార్మిక వ్యతిరేక నిర్ణయాల పై పోరాటాలను నిర్వహించి వారి హక్కులను పరి రక్షించి బీటీ రణదేవ్ ఆశయాలను ప్రతి కార్మికుడు కొనసాగించాలని పిలుపు నిచ్చారు.