భూత్పూర్, ఫిబ్రవరి 11 : దేవరకద్ర నియోజకవర్గంలోని భూత్పూర్, కొత్తకోట, దేవరకద్ర మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కైవసం చే సుకుంటుందని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు స్పష్టమైన మెజార్టీని సాధిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన బీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి కృషి చేసిన ఇన్చార్జీలు, నాయకులు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగిందని ఆయన తెలిపారు.
ప్రజలకు బీఆర్ఎస్ పార్టీపై మమకారం పెరిగిందని గుర్తు చేశారు. కార్యకర్తలంతా ఎంతో కసితో పనిచేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి ఫలితాలు కూడా మనకు అనుకూలంగా వస్తాయని ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సత్తూర్ బస్వరాజ్‌గౌడ్, మాజీ సర్పంచులు సత్తూర్ నారాయణగౌడ్, మనెమోని సత్యనారాయణ, మురళీధర్‌గౌడ్, గోప్లాపూర్ సత్యనారాయణ, గడ్డ ప్రేమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.