హైదరాబాద్ : రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటనను తాము స్వాగతిస్తున్నామని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కాకపోతే ఆయన రాష్ట్రంలోనే ఉండి ఇక్కడ రైతుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి తెలుసుకొని, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో వాటిని అమలు చేయాలని మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూను ట్విట్టర్లో పంచుకున్నారు.
తెలంగాణ రైతుల విషయంలో రాహుల్ గాంధీకి ఉన్న సానుభూతిని స్వాగతిస్తున్నాం..కాకపోతే తెలంగాణ కంటే మెరుగైన పరిపాలన నమూనా నాకు చూపించాలని రాహుల్ గాంధీని కోరుతున్నా. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో కాంగ్రెస్ ప్రభుత్వాలు రైతుబంధు అందిస్తున్నాయా..? 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నాయాఝ ? లేక వ్యవసాయ రుణమాఫీ హామీని నెరవేర్చాయా..? సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఖాళీ వాగ్దానాలు చేయడం హాస్యాస్పదం..
రైతుల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన చర్యలు స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ చేయలేదనే విషయాన్ని నేను గర్వంగా చెబుతున్నానని మంత్రి కేటీఆర్ అన్నారు. రైతుల కోసం ఏం చేయకుండా ఇలా ఖాళీ వాగ్దానాలు చేయడం హాస్యాస్పదం అని మండిపడ్డారు. రాహుల్ గాంధీ పర్యటన అకాడమిక్‌కు సంబంధించినది కాదు…అది రాజకీయానికి సంబంధించింది అందుకే ఉస్మానియా యూనివర్సిటీ వీసీ రాహుల్‌ను అనుమతించలేదేమో..? లేదా రాహుల్ గాంధీ విద్యాపరమైన, మేధోపరమైన స్థాయి విద్యార్థులను కలవడానికి సరిపోవు అని భావించి ఉండవొచ్చు. ఏదేమైనా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించడానికి అసలు ఆయనకి ఉన్న అర్హత ఏంటి..? అతనేమైనా క్వాలిఫైడ్ ప్రొఫెసరా..? ఆలోచించుకోవాలన్నారు.
రాజకీయ కారణాలతో అందరినీ విమర్శిస్తాం కానీ.. పరువు మర్యాదలను కాపాడుకుంటాం. ఇటీవల రాహుల్ గాంధీపై అసోం ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను సీఎం కేసీఆర్ ఖండించారు. ఇతర పార్టీల నుంచి కూడా అదే ఆశిస్తున్నాం. కానీ టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి రోజు విడిచి రోజు ముఖ్యమంత్రిపై దూషణలు చేస్తున్నారు. బీజేపీ నాయకులు కూడా అదే చేస్తున్నారు. మనం అదే తిరిగి చెల్లిస్తున్నాం’ అని ఇంటర్వూలో మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చారు.
Political tourists will come and go😀
Only KCR Garu here to stay in #TELANGANA pic.twitter.com/dP5iBWidGN
— KTR (@KTRTRS) May 6, 2022