నార్నూర్ : గ్రామ పంచాయతీలతో పాటు ఆదివాసి సమాజ అభివృద్ధికి కృషి చేయాలని రాయి సెంటర్ సార్ మేడి మెస్రం దుర్గుపటేల్ ( Durgu Patel ) కోరారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం మాన్కాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో రాయి సెంటర్ ( Rai Center ) ఆధ్వర్యంలో సర్పంచ్, ఉప సర్పంచులను శాలువాతో సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు పంచాయతీల అభివృద్ధితోపాటు సమాజ ఉన్నతికి కృషి చేయాలని సూచించారు. నేటితరం యువత ఉన్నత చదువులపై శ్రద్ధ పెట్టేలా చూడాలని, చదువులతోనే ప్రయోజకులుగా ఎదిగినప్పుడు సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందన్నారు.
కార్యక్రమంలో జేఏసీ అధ్యక్షుడు మేస్రం రూప్ దేవ్, ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ తోడసం నాగోరావ్, ఐటీడీఏ మాజీ డైరెక్టర్ మడవి మాన్కు, ఖైరదట్వా రాయి సెంటర్ సార్ మెడి తుకారాం,సర్పంచుల సంఘం మాజీ మండల అధ్యక్షుడు ఉర్వేత రూప్ దేవ్, మాజీ సర్పంచ్ మడవి రూప్ దేవ్, ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ జిల్లా ఉపాధ్యక్షుడు మెస్రం మానికిరావ్,రాజ్ గోండ్ సేవా సమితి మండల అధ్యక్షుడు ఆత్రం పరమేశ్వర్, ఆదివాసి సంక్షేమ పరిషత్ జిల్లా నాయకుడు పూసం ఇస్రూ, విద్యార్థి సంఘం మండల అధ్యక్షుడు కోట్నాక్ శ్యాం రావ్, సర్పంచులు,ఉప సర్పంచ్ ఉన్నారు