– సీపీఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు
బూర్గంపహాడ్, సెప్టెంబరు 03 : అమరజీవి కందుకూరి నాగేశ్వరరావు ఆశయ సాధనకు ప్రతి కార్యకర్త ఉద్యమించాలని సీపీఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. గురువారం సీపీఎం బూర్గంపహాడ్ మండల నాయకుల కందుకూరి నాగేశ్వరరావు సంస్మరణ సభ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు అధ్యక్షతన పాత సారపాకలో జరిగింది. ఈ సందర్భంగా మచ్చా జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రేపాకుల శ్రీనివాస్, సీపీఎం సీనియర్ నాయకులు చిటికెన ముసలయ్యలతో కలిసి నాగేశ్వరరావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. నిస్వార్ధంగా పార్టీకి, ప్రజలకు సేవ చేసిన మహనీయుడు నాగేశ్వరరావు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నర్సారెడ్డి, అన్నవరపు సత్యనారాయణ, చర్ల మండల కార్యదర్శి మచ్చా రామారావు, కరకగూడెం మండల కార్యదర్శి కొమరం కాంతారావు, ములకలపల్లి సీఐటీయూ కన్వీనర్ నిమ్మల మధు, సీపీఎం మండల కమిటీ సభ్యులు రాయల వెంకటేశ్వర్లు, ఎస్. అబీద, పాండవుల రామనాథం, కనకం వెంకటేశ్వర్లు, గుంటక కృష్ణ, బోళ్ల శ్రీశైలం, మరియమ్మ, అలివేలమ్మ, జానిమియా, చందర్రావు పాల్గొన్నారు.