తాడూరు, జనవరి 21 : యూరియా కోసం నాలుగు రోజుల నుంచి మండల కేంద్రంలోని పీఏసీసీఎస్ కార్యాలయం వద్ద పడిగాపులు కాస్తున్నాం.. బువ్వలే దు.. నీళ్లు లేవని ఓ మహిళా రైతులు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఎదుట వాపోయింది. నాగర్‌కర్నూల్ నుంచి కల్వకుర్తి వైపు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే మర్రిజనార్దన్‌రెడ్డి తాడూ రు పీఏసీసీఎస్ కార్యాల యం ముందు యూరియా కోసం మహిళలు బారులు తీరడంతో గమనిం చి అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా మ హిళలు మాట్లాడుతూ ఉదయం 5గంటలకు పిండి సంచుల కోసం వస్తున్నామని నాలుగు రోజు లు అయింది ఈ ఆఫీస్ కాడనే పడి చస్తున్నామని.. బువ్వలేదు.. నీళ్లు లేవు.. పాడు లేవు.. గ తంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే రైతులం వ్యవసాయ పొలాల్లో ఉన్నామని ఈ ఇందిరమ్మ పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులం రోడ్డున పడ్డామంటూ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డితో తమ ఆవేదనను వ్యక్తం చేశారు.
వానకాలంలో కూడా సక్రమంగా యూరియా సరఫరా కాకపోవడంతో రైతులకు పంట దిగుబడి రాలేదని కనీసం యాసంగి పంటకైనా సరిపడా యూరియా ఇస్తారని ఎంతో ఆశించామని రైతులు అంటున్నారు. కనీసం యూరియాను బయట మార్కెట్లో ఎక్కువ ధరకు కొందామన్న కూడా ఎక్కడా దొరకడం లేదన్నారు. ఈ యాసంగి సీజన్లో ఎక్కువ శాతం మొక్కజొన్న, జొన్న మినుము తదితర పంటలు వేసుకున్నామని వాటికికూడా యూరియా సరఫరా సక్రమంగా లేదని వాటి వల్ల వేసిన పంట ఎదుగుదల లేక గిడసబారిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
కనీసం వర్షాకాలంలో పెట్టుబడులు కూడా వెళ్లలేదని యాసంగి పంటలు కూడా పెట్టుబడులు వచ్చే పరిస్థితులు లేదన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ రైతుకు కావాల్సిన ఎరువులు, మందులు అందుబాటులో ఉంచామని రైతులం వ్య వసాయ పొలంలో ఉండి ఆటోకు ఫోన్ చేస్తే పిండి బస్తాలు తమ పొలాలకు తీసుకొచ్చే వారని అంతేకాకుండా లారీల కొద్ది రెండుమూడు ఊర్లలకు అందుబాటులో ఉన్న ఒక ఊరిలో యూరియాను అందుబాటులో ఉంచి రైతులకు మేలు చేకూర్చామన్నారు. ఇప్పుడు రైతుబంధు కూడా సకాలంలో ఇవ్వడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రెండుసార్లు మాత్రమే రైతుబంధు ఇచ్చి మిగతాది ఎగ్గొట్టారని ఆరోపించారు.
అయితే ఎరువుల విషయమై సంబంధిత వ్యవసాయ అధికారిని వివరణ కోరగా మండలంలోని సింగి విండో కార్యాలయంతోపాటు మేడిపూర్, ఐతో ల్, యాదిరెడ్డిపలి గుంతకోడూరు గ్రామాల్లోని ఆగ్రో రైతు సేవ సెంటర్లల్లో దాదాపు 2550 బస్తాల యూరియా ఉందని కేవలం ఈనెల 19న రైతులకు కూపన్లు ఇచ్చిన వారే బుధవారం యూరియా కోసం రావడం జరిగిందన్నారు. మండల కేంద్రంలో 1350బస్తాలు ఉండగా దాదా పు 800బస్తాలు బుధవారం రోజున పంపిణీ చేశామన్నారు.