మహబూబ్నగర్, జనవరి 21 : జిల్లా కేంద్రంలోని రూరల్ పోలీసు స్టేషన్కు కూత వేటు దూరంలో ఉన్న శ్రీనివాసకాలనీలో ఓ గర్భిణి మహిళను ఇద్దరు వ్యక్తులు బైక్పై వచ్చి మేము మఫ్టీలో ఉన్న పోలీసులమని చెప్పి ఆమె నుంచి రెండు తులాల బంగారు గొలుసు ఎత్తుకెళ్లిన ఘటన బుధావారం చోటు చేసుకున్నది. ఇదే ప్రాంతంలో ఇదే నెల లో 6వ తేదీన ఇదే మాదిరిగా పోలీసుమని ఓ వృద్ధురాలి మెడలోని నాలుగున్నర తులాల బంగారం గొలుసు ఎత్తుకెళ్లిన ఘటన మరవకముందే ఇది రెండోది కావడంతో జిల్లా ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం జిల్లా కేంద్రంలోని శ్రీనివాసకాలనీలో సుకన్య, తిరుపతయ్య దంపతులు నివాసం ఉంటున్నారు. తిరుపతయ్య టీ కొట్టు పెట్టుకొని జీవనోపాధి పొందుతున్నారు. అయితే బుధవారం మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో సుకన్య గర్భవతి కావడంతో దవాఖానకు వెళ్లి వైద్యపరీక్షలు తిరిగి ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు వచ్చి తా ము పోలీసుమని ఇక్కడ హత్య జరిగింది. దొంగలు ఉన్నారు వా రు వచ్చి మీ బంగారు ఎత్తుకెళ్తాతారు.
జాగ్రత్త అని చెప్పి ఆమెను ఏమార్చి ఇద్ద రు వ్యక్తు లు ఆమెను మాయమాటలు చెప్పి మెడలో ఉన్న బంగారు చైన్ తీసి హ్యండ్బ్యాంగ్ పర్సులో పెట్టుకొమని చెప్పారు. ఆమె పోలీసులని నమ్మి వారు చెప్పినట్లు మెడలో ఉన్న బంగా రు గొలుసును పర్సులో పెట్టుకోగా ఏదీ పర్సులో పెట్టావా చూపించు అని అన గా ఆమె తీసి చూపిస్తుండగా పక్కన మరో వ్యక్తికి ఇదే విధంగా చెబుతుండగా ఆమె ఆ వ్యక్తి చూస్తుండ గానే ఆ గొలుసును తీసుకొని అక్కడి నుంచి పరారయ్యారు.
గర్భిణి మహిళ ఇంటికి వెళ్లి పర్సు లో ఉన్న బంగారు గొలుసు చూ సుకోగా కనిపించకపోవడంతో మోసపోయాయని గుర్తించి వెంటనే భర్తకు ఫోన్ చేసింది. ఆయన వచ్చి వారి కోసం చుట్టుపక్కల వెతికినా ఎక్కడా కనిపించకపోవడంతో వెంటనే రూరల్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు.