కీవ్: ఆపరేషన్ స్పైడర్ వెబ్‌తో రష్యాలోని ఎయిర్‌బేస్‌లపై దాడి చేసి 40కిపైగా యుద్ధవిమానాలను ధ్వంసం చేసిన ఉక్రెయిన్ తాజాగా మరోషాక్ ఇచ్చింది. రష్యాను, ఆక్రమిత క్రిమియాను కలిపే వంతెనను నీటి కింద అమర్చిన బాంబులతో పేల్చివేసినట్లు ఉక్రెయిన్‌కి చెందిన నిఘా సంస్థ ఎస్‌బీయూ మంగళవారం ప్రకటించింది. ఇందుకు సంబంధించిన రెండు వీడియోలను కూడా ఎస్‌బీయూ విడుదల చేసింది. అయితే ఉక్రెయిన్ వాదనపై రష్యా ఇంకా స్పందించలేదు.
శుభాన్షు రోదసి యాత్ర జూన్ 10కి వాయిదా
ఫ్లోరిడా: భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా సహా నలుగురు వ్యోమగాముల్ని ఐఎస్ఎస్కు పంపేందుకు చేపట్టిన ఏఎక్స్-4 ప్రోగ్రాం మరోమారు వాయిదా పడింది. తాజాగా కొన్ని నిర్వహణపరమైన సర్దుబాట్లు, క్వారంటైన్ ప్రొటోకాల్స్ కారణంగా జూన్10న మిషన్ ప్రయోగాన్ని చేపట్టబోతున్నట్టు సంస్థ ప్రకటించింది. అమెరికా ప్రైవేట్ సంస్థ ‘ఏక్జం స్పేస్’కు చెందిన ‘ఏఎక్స్-4 మిషన్’ను మే 29న చేపట్టాలని తొలుత నిర్ణయించారు. కానీ మిషన్ ప్రయోగాన్ని జూన్ 8కి వాయిదా వేశారు.