ముంబై: బీజేపీ, శివసేన పార్టీలు శత్రువులు కాదని ఇటీవల మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తనదైన రీతిలో స్పందించారు. తామేమీ భారత్-పాకిస్థాన్ లాంటి వాళ్లం కాదని ఆయన చెప్పారు. బాలీవుడ్ హీరో అమీర్‌ఖాన్-కిరణ్‌రావుల బంధం లాంటిదే తమ బంధం కూడా ఆయన వ్యాఖ్యానించారు. తమ రెండు పార్టీల రాజకీయ మార్గాలు వేరైనా.. తమ మధ్య స్నేహ భావం ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు.
బీజేపీ, శివసేన పార్టీల అనుబంధం గురించి ఇటీవల దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా తామేమీ శత్రువులం కాదని ఆయన ముక్తసరి సమాధానం ఇచ్చారు. దీనిపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌ను ప్రశ్నించగా పై వ్యాఖ్యలు చేశారు.
ఇవి కూడా చదవండి..
ఇంటర్నెట్ తెచ్చిన తంటా.. చెట్టుపై నుంచి ఉపాధ్యాయుడి బోధన..!
చేపల కోసం వల వేస్తే కొండచిలువ చిక్కింది..!
పేక మేడలా కూలి నదిలో మునిగిన ఇల్లు.. వీడియో