మల్కాజిగిరి, జూలై 14: మల్కాజిగిరిలోని జిల్లా ఆస్పత్రికి నీటి కొరత తీరింది. ‘నీటి సమస్య.. ఆగిన ఆపరేషన్లు’ అనే శీర్షికన నమస్తే తెలంగాణలో ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. ఈమేరకు మల్కాజిగిరి జిల్లా ఆస్పత్రిలో నీటి సమస్య పరిష్కారానికి నూతన బోర్వెల్ మోటార్‌ను మంగళవారం జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాధ ప్రారంభించారు.
నీటి సౌకర్యం అందుబాటులోకి రావడంపై ఆస్పత్రి సిబ్బంది, రోగులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంఓ డాక్టర్ సాయిశోభ, అడ్మినిస్ట్రేటర్ డా.నరేందర్, పీఆర్ఓ డా.వినోద్, ఏఓ రమేష్, సూపరిండెంట్లు విష్ణు, వినయ్, సిబ్బంది పాల్గొన్నారు.