న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రమాదకర ‘పారాక్వాట్’ కలుపు నివారణ మందుపై దేశవ్యాప్తంగా పూర్తి నిషేధం విధిస్తూ మంగళవారం ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖ పారాక్వాట్ డైక్లోరైడ్ దిగుమతి, ఉత్పాదన, విక్రయం, రవాణా, పంపిణీ, వినియోగాన్ని తక్షణమే నిషేధించింది.
పారాక్వాట్కు విరుగుడు లేదు. ఇది శరీరంలోకి ప్రవేశిస్తే ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిని, శ్వాస తీసుకోలేక బాధితులు ప్రాణాలు కోల్పోతారు. ఈ ముసాయిదా నోటిషికేషన్పై అభ్యంతరాలు, సూచనలు తెలియజేయడానికి 2026, జూలై 13 నుంచి 30 రోజుల సమయం ఇచ్చారు. తుది నోటిఫికేషన్ వచ్చాక పారాక్వాట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు రద్దు అవుతాయి.