రామడుగు, జనవరి 8 : కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రీ పంప్‌హౌస్‌లో గురువారం ఎత్తిపోతలు ప్రారంభించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు ఒకటో నంబర్ (యూనిట్) మోటర్‌ను ప్రారంభించి, జలాలను తరలించారు. శనివారం ఉదయం వరకు మోటర్ నడుస్తుందని తెలిపారు.
గాయత్రీ పంప్‌హౌస్ నుంచి సుమారు 5.7 కిలోమీటర్ల దూరం వరకు ఉన్న గ్రావిటీ కాలువ పరీవాహక గ్రామాలతోపాటు గంగాధర, బోయినపల్లి, మల్యాల మండలాల్లోని వరదకాలువ పరీవాహక గ్రామాల రైతులకు సాగునీటిని అందించనున్నారు.