KL Rahul | టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ రాహుల్ సాధారణంగా చాలా ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఉంటాడని.. కానీ ఐపీఎల్లో(IPL) పంజాబ్ జట్టు ప్రదర్శన కారణంగా అతను తీవ్ర నిరాశకు గురయ్యాడని భారత మాజీ క్రికెటర్, పంజాబ్ కింగ్స్ (PBKS) మాజీ బ్యాటింగ్ కోచ్ వసీం జాఫర్(Wasim Jaffer) తెలిపారు. అలాగే తన కెరీర్లో ఒకే ఒక్కసారి కోపంగా ఉండటం చూశానని దూరదర్శన్లోని ‘ది గ్రేట్ ఇండియన్ క్రికెట్ షో’లో మాట్లాడుతూ, ఆ ఫ్రాంచైజీతో తన కోచింగ్ అనుభవాలకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను జాఫర్ జాపర్ వెల్లడించారు.
కేఎల్ రాహుల్ 2018 నుండి 2021 వరకు పంజాబ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. బ్యాటింగ్‌లో రాణించినప్పటికి జట్టును విజయపథంలో నడిపించడంలో విఫలమయ్యాడు. అదే సమయంలో వసీం జాఫర్ ఆ జట్టుకు ప్రధాన కోచ్‌గా పనిచేశారు. ఈ క్రమంలో జాఫర్ నాటి అనుభవాలను గుర్తు చేసుకున్నారు. పంజాబ్ చాలా సార్లు గెలిచే స్థితిలో ఉండి కూడా మ్యాచ్‌లు స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యామన్నారు.
రాహుల్ సహజంగానే చాలా ప్రశాంతంగా ఉండే వ్యక్తి మితభాషి. ఎక్కువగా తన సన్నిహిత స్నేహితుల మధ్యే గుడపుతారు. బయట ఎక్కువగా కనిపించరు. మైదానంలో లేదా బయట ఆయన సహనం కోల్పోవడం చాలా అరుదైన విషయమన్నారు. అయితే సులభంగా గెలవాల్సిన ఒక మ్యాచ్‌లో ఓడిపోయిన తర్వాత రాహుల్ నిజంగా కోపంగా ఉండటం నేను మొదటిసారి చూశాను.
అతను అప్పుడు అభ్యంతరకరంగా ఏమీ మాట్లాడలేదు, కానీ మేము ఎంత పేలవంగా ఆడామన్న దానిపై అతను ఎంత తీవ్ర అసహనానికి గురయ్యాడో స్పష్టంగా కనిపించిందని పేర్కొన్నాడు. కేఎల్ రాహుల్ కొంచెం కోపంగా ఉండటం నేను చూడటం అదే ఏకైక సందర్భం అదేనని జాఫర్ తెలిపారు.