మట్టెవాడ, మార్చి 13 : మూఢనమ్మకాలను విడనాడాలని వరంగల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వడ్డె నరేష్కుమార్ అన్నారు. వరంగల్ బట్టలబజార్, ఖమ్మంరోడ్, కరీమాబాద్ రోడ్లను కలిపే మూడు బాటల ప్రాంతంలో తరుచూ ప్రజలు నిమ్మకాయలు, కొబ్బరికాయలు, కోడిగుడ్లు, ఇతర వస్తువులు పెడుతుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, దీంతో డాక్టర్ రాజేంద్రప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్వోబీపై ఆదివారం ఉదయం ప్రజలకు అవగాహన కల్పించారు.
రోడ్డుపై ఇలాంటి వస్తువులు పెట్టడం అనేది ఒక మూఢనమ్మకమని చెప్పారు. రోడ్లపై ఇలాంటి వస్తువులు పెట్టి ప్రమాదాలకు కారకులు కావద్దని సీఐ నరేష్కుమార్ తెలిపారు. రోడ్డుపై పెట్టిన కోడిగుడ్లు, నిమ్మకాయలు, కొబ్బరికాయలను అందరూ చూస్తుండగానే సీఐతోపాటు హోంగార్డు నారాయణ, చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు తిన్నారు.