వర్ధన్నపేట/రాయపర్తి/సంగెం/గీసుగొండ/ మార్చి 13 : తొలితెలుగు కవయిత్రి మొల్ల జయంతి వేడుకలలు ఆదివారం జరిగాయి. వర్ధన్నపేట మండలకేంద్రంలో కుమ్మరి కుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సంఘం నాయకులు నాంపెల్లి వెంకన్న, అమరరాజు రాజు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుమ్మరి కుల సంఘం జిల్లా ప్రతినిధులు నాంపెల్లి అయిలయ్య, ఉప్పునూతన రాజు, చిలువేరు రాములు, వెంకటేశం, శ్రీనాథ్, హరీశ్, పుల్లయ్య, భద్రయ్య, శ్రీనివాస్, రవి, సదానందం, శ్రీనివాస్, నిర్మల, లక్ష్మీకాంతం, అజయ్‌కుమార్ పాల్గొన్నారు. రాయపర్తి మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్-గ్రామ పంచాయతీ వాణిజ్య సముదాయ భవనాల ఆవరణల్లో మొల్ల చిత్రపటం వద్ద ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్ కుమ్మరి సంఘం ప్రతినిధులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
కుమ్మరి సంఘం ప్రతినిధులు రాయారపు సారంగం, మండల అధ్యక్షుడు వనపర్తి సారయ్య, కోశాధికారి వెంకటయ్య, పి.సమ్మయ్య, మహేందర్, అశోక్, రాము, సమ్మయ్య, అనిల్‌కుమార్ పాల్గొన్నారు. సంగెం మండలం మొండ్రాయి గ్రామ పంచాయతీలో మొల్ల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సర్పంచ్ గూడ కుమారస్వామి, ఎంపీటీసీ కొనకటి రాణీ మొగిలి, ఉపసర్పంచ్ పెండ్లి శారదా కుమారస్వామి, కుమ్మరి సంఘం నాయకులు దామెరుప్పుల స్వామి, రాజేశ్వర్, వీరభద్రయ్య, చంద్రమౌళి, వీరయ్య, రాజేష్, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు అనుముల ప్రతాప్, కక్కెర్ల వీరస్వామి, సూరయ్య, ఎడాకుల శ్రీనివాస్ పాల్గొన్నారు. గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ ధర్మారం గ్రామంలో దూరవిద్య కోఆర్డినేటర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో మొల్ల చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. శాలివాహన సంఘం అధ్యక్షుడు కుమారస్వామి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోలి రాజయ్య, శ్రీనివాస్, ప్రసాద్, రాజయ్య, కిషన్ పాల్గొన్నారు.