పోచమ్మమైదాన్, మార్చి 12: చేనేత ఉత్పత్తులకు నిలయమైన కొత్తవాడను కర్నాటకు రాష్ర్టానికి చెందిన పలువురు విద్యార్థులు శనివారం సందర్శించారు. ఇప్పటికే పోచంపల్లి, కోయలగూడెంలోని పట్టుచీరెల ఉత్పత్తులపై అధ్యయనం చేసిన విద్యార్థులు.. వరంగల్‌కు జిల్లాకు చేరుకున్నారు. స్టడీ టూర్లో భాగం గా కర్నాటకలోని శ్రీష్టి మనిఫాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్, డిసైన్ అండ్ టెక్నాలజీకి చెందిన 18 మంది విద్యార్థులు కొత్తవాడలో ని నేత కార్మికుల ఇళ్లను సందర్శించారు. తమకు గైడ్‌గా వచ్చిన అధ్యాపపకులతో కలిసి ఉత్పత్తులను నిశితంగా పరిశీలించారు. ము ఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఉన్న ఎక్స్‌పోర్టు దర్రీస్ను చూసి ఆకర్షితులయ్యారు. వీటి తయారీ విధానాన్ని క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు.
దర్రీస్తోపాటు కలంకారి, డైయింగ్ తయారీని ప్రతక్ష్యంగా చూశారు. చేనేత ఉత్పత్తుల మార్కెటింగ్, తెలంగాణ ప్రభుత్వం ద్వారా కార్మికులకు అందుతున్న సౌకర్యాలు తెలుసుకున్నారు. సాయంత్రం వరకూ చేనేత సంఘం నాయకుడు చిప్ప వెంకటేశ్వర్లు విద్యార్థులకు వివరించారు. వీరు ఇక్కడే రెండు రోజులపాటు నేత ఉత్పత్తులపై పరిశోధన చేయనున్నారు.