చెన్నారావుపేట, డిసెంబర్ 31: తపాలా కార్యాలయ సేవలు పల్లెలకు విస్తరిస్తున్నాయని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఖాదర్‌పేట, బోజేర్వులో శుక్రవారం ఆయన పోస్టాఫీసులను ప్రారంభించి మాట్లాడారు. మారుమూల గ్రామాలకు సైతం పోస్టల్ సేవలను విస్తరిస్తున్నారన్నారు. ఈ సేవలను గ్రామీణులు, తండావాసులు వినియోగించుకోవాలని సూచించారు. ఎంపీపీ బదావత్ విజేందర్, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ రఫీ, తపాలా శాఖ వరంగల్ సూపరింటెండెంట్ ఉమామహేశ్వర్, ఖాదర్‌పేట, బోజేర్వు సర్పంచ్‌లు అనుముల కుమారస్వామి, పిండి విజయాభిక్షపతి, బోడ సమ్మునాయక్, వైస్ ఎంపీపీ కంది కృష్ణారెడ్డి, ఆర్బీఎస్ మండల కన్వీనర్ బుర్రి తిరుపతి, మాజీ ఎంపీపీ జక్క అశోక్‌యాదవ్, వైస్ ఎంపీపీ కంది కృష్ణారెడ్డి, మాజీ జడ్పీటీసీ జున్నూతుల రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నెక్కొండ: గొల్లపల్లిలో జరిగిన టీఆర్ఎస్ యువ నాయకుడు అఖిల్ వివాహ రిసెప్షన్‌కు, బొల్లికొండలో జరిగిన మాలోత్ యాకునాయక్-అరుణ దంపతుల కుమారుడు మహేందర్ రిసెప్షన్‌కు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఎంపీపీ జాటోత్ రమేశ్‌నాయక్, సొసైటీ చైర్మన్ మారం రాము, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంగని సూరయ్య, జడ్పీటీసీ లావుడ్యా సరోజనా హరికిషన్, వైస్ ఎంపీపీ రామారపు పుండరీకం, నాయకులు కట్కూరి నరేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.