హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 20: వరంగల్ జిల్లాస్థాయి క్రాస్ కంట్రీ పోటీల ఎంపికలు ఈనెల 22న హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు వరంగల్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పుల్యాల కిషన్, కార్యదర్శి ఊర యుగంధర్‌రెడ్డి తెలిపారు. అండర్-16, 18, 20, మెన్ అండ్ ఉమెన్లలో ఎంపికలు జరుగుతాయని పేర్కొన్నారు. ఇందులో ఎంపికైన క్రీడాకారులు జనవరి 2న గచ్చిబౌలిలో జరిగే 11వ రాష్ర్టస్థాయి క్రాస్ కంట్రీ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంటారని చెప్పారు. జిల్లాస్థాయి ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారులు 22న ఉదయం 8 గంటలకు జనన ధృవీకరణ పత్రంతో జేఎన్ఎస్లో హాజరుకావాలని సూచించారు.
అండర్-16 బాలబాలికలు 25-01-2010 నుంచి 24-01-2012 మధ్యలో జన్మించి ఉండాలని, అండర్-18 బాలబాలికలు 25-01-2008 నుంచి 24-01-2010 మధ్యలో, అండర్-20 బాలబాలికలు 25-01-2006 నుంచి 24-01-2008 మధ్యలో జన్మించి ఉండాలని తెలిపారు. మెన్ అండ్ ఉమెన్ 24-01-2026 వరకు 20 సంవత్సరాలు నిండి ఉండాలని, 16 సంవత్సరాల బాలబాలికలకు 2 కిలోమీటర్లు, 18 సంవత్సరాల బాలురకు 6 కిలోమీటర్లు, 18 సంవత్సరాల బాలికలకు 4 కిలోమీటర్లు, 20 సంవత్సరాల బాలురకు 8 కిలోమీటర్లు, 20 సంవత్సరాల బాలికలకు 6 కిలోమీటర్లు, మెన్ అండ్ ఉమెన్ 10 కిలోమీటర్లలో ఎంపికలు జరుగుతాయని తెలిపారు. ఇతర వివరాలకు ఊర యుగంధర్‌రెడ్డి 9866564422, బండి కృష్ణమూర్తి 9000354465, పి.మహేందర్ 9618828299 నెంబర్లలో సంప్రదించాలన్నారు. ఎంట్రీ ఫీ ఒక్కరికి రూ.100 ఉంటుందని, విజేతలకు మెడల్స్, మెరిట్ సర్టిఫికెట్లు, పాల్గొన్న వారందరికీ సర్టిఫికెట్లు అందజేయనున్నట్లు తెలిపారు.