మూసాపేట : మహబూబ్నగర్ జిల్లా మూసాపేట ( Moosapet ) మండలం వేముల గ్రామంలో జరిగిన యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డ నిందితుడిని అరెస్టు ( Arrest ) చేశామని జిల్లా ఎస్పీ డి. జానకి ( SP D. Janaki ) వెల్లడించారు. శనివారం మూసాపేట పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించి వివరాలను ఆమె వెల్లడించారు. ఈ కేసులో నిందితుడిగా సంగు విష్ణు అలియాస్ ఇంటెంకి విష్ణు అలియస్ వాకిటి విష్ణుపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.
ఈ నెల 17న రాత్రి ఎస్సీ కులానికి చెందిన యువతిపై అత్యాచారం చేయడంతో ఆమె అపస్మారకంలోకి వెళ్లిందన్నారు. బాధితురాలని నిందితుడు, ఆమె బంధువు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమద్యలో చనిపోయిందని వివరించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శనివారం నిందితుడిని అరెస్టు చేశామని వెల్లడించారు.