ఖమ్మం రూరల్, డిసెంబర్ 20 : తెలంగాణ స్టేట్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (టెస్రా) ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిగా రూరల్ మండల తాసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న ప్రసాద్ ఎన్నికయ్యారు. శనివారం ఖమ్మం నగరంలోని టీఎన్జీవోస్ ఫంక్షన్ హాల్లో టీఎన్జీవోస్ అనుబంధ శాఖల అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. అందులో భాగంగానే జిల్లా కమిటీ ఎన్నిక కావడం జరిగింది. ఈ కమిటీలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ఆర్ఐ ప్రసాద్ తో పాటు అసోసియేట్ ప్రెసిడెంట్గా డీటీ రవీందర్, సంఘం జిల్లా కోశాధికారిగా మరో రెవెన్యూ ఇన్స్పెక్టర్ క్రాంతికి చోటు దక్కింది. ట్రెసా జిల్లా కమిటీలో చోటు దక్కించుకున్న పలువురు మండల అధికారులకు తాసీల్దార్ పి.రాంప్రసాద్ పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.