
చెన్నారావుపేట, నవంబర్ 14: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2020-21 సంవత్సరానికి ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఎంటర్ ప్రెన్యూర్ (వ్యాపారవేత్త) పరీక్షల్లో గిరిజన విద్యార్థిని బానోతు పల్లవి ప్రతిభ కనబరిచి ఎంపికైంది. మండలంలోని తోపనగడ్డ తండాకు చెందిన ఆమె రాష్ట్ర ప్రభుత్వం గర్వించే స్థాయికి ఎదిగింది. 2014 సంవత్సరంలో బీటెక్ పూర్తి చేసి, వివాహం తర్వాత భర్త బానోతు ప్రేమ్నాయక్ ప్రోత్సాహంతో సాధించినట్లు తెలిపారు. త్వరలోనే ప్రభుత్వ సహకారంతో రూ.1.60కోట్లతో వ్యాపారాన్ని ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఈసందర్భంగా రాష్ట్ర వ్యాపారవేత్త పరీక్షల్లో ప్రతిభ చాటిన పల్లవిని పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు అభినందించారు.